Chiranjeevi played Hanuman Role in sequel : ప్రశాంత్ వర్మ దర్సకత్వం లో హీరో తేజ సజ్జా హీరో గా జనవరి 12 విడుదలైన చిత్రం హనుమాన్ మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే, రిలీజ్ అయిన 25 రోజుల్లోనే 300 కోట్లు వసూళ్ళు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ సంవత్సరం లోనే 300 కోట్లు రాబట్టిన మొదటి సినిమా అనేది సిని చరిత్రలో రికార్డ్ అని ప్రశాంత్ వర్మ పోస్ట్ చేసారు. ఇంతలా ఆదరిస్తున్న సినిమా ప్రేక్షకులకు నా ప్రత్యేక ధన్యవాదాలని చెప్పారు. ఈ పోస్ట్ ని చూసిన పలువురు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు.
అంతేకాకుండా ‘సంక్రాంతి సీజన్‌లో రిలీజైన సినిమాల జాబితా’లో.. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో నంబరు 1గా నిలిచిందని చెప్పచ్చు. 92 ఏళ్ల టాలీవుడ్ ప్రస్థానంలో ఆల్‌టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా ఈ మూవీ నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రానుంది.
కొన్ని రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయని యూనిట్ సబ్యులు ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నామని చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు.
‘‘ఆన్‌స్క్రీన్‌తో పాటు, ఆఫ్ స్క్రీన్‌లోనూ వారి ఇమేజ్ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలని ఆయన అన్నారు. మేము అనుకున్న జాబితాలో చిరంజీవి సర్ కూడా ఉండొచ్చు’’ అని ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.
దీంతో ఈ సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలు పెరిగాయని చెప్పాలి