Chittagong at night in the spiritual city of Tirupati : ఆధ్యాత్మిక నగరం తిరుపతి లో రాత్రిళ్ళు చెడ్డీగాంగ్. పార్టీల పేరుతో విద్యార్థుల వీరంగం.
ఆధ్యాత్మిక నగరంగా పేరు పొందిన తిరుపతిలో కొన్ని విచిత్రమైన సంఘటనలు కొన్ని ప్రమాదకరమైన సంఘటనలు ఈ మధ్య వెలుగు చూస్తున్నాయి. నగరంలో ఇంతకుముందు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేది. కానీ ఇప్పుడు భయానక, భీతావహ వాతావరణం తాండవిస్తోంది.
నగరంలో ఈ మధ్య కాలంలో చడ్డీ గాంగ్ సంచరిస్తోంది. పగటి పూట రెక్కీ నిర్వహించే ఈ చెడ్డి గ్యాంగ్ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుంటాయి. ఇక మార్క్ చేసుకున్న సదరు ఇళ్లపై రాత్రివేళ మాటు మణిగాక దాడి చేస్తాయి. ఇంటి తాళాలు బద్దలు కొట్టడమో, లేదంటే ఇంటి వెనుకవైపు వెంటిలేషన్ కోసం ఏర్పాటు చేసిన కిటికీలు విరగ్గొట్టి లోపలి చొరబడటమో చేస్తాయి. ఆ తరువాత చెప్పేదేముంది. ఇంట్లో ఉన్న విలువైన సామగ్రి ఏమి ఉంటె వాటిని చేతపట్టుని వెల్లిపోతారు.
ఈ చెడ్డి గ్యాంగ్ చేసే మరో రకమైన దోపిడీ ఏమిటంటే బాగా నడిరాత్రి లో నగర శివారు లో ఉన్న ఇళ్లను చూసుకుంటారు. ఆ ఇంటికి వెళ్లి నేరుగా కాలింగ్ బెల్ కొడతారు, లేదంటే తలుపులు తడతారు, అదీ కాదంటే విచిత్రమైన శబ్దాలు చేయడమో, లేక ఆపదలో ఉన్నట్టు అరవడమో చేస్తారు. ఇలాంటి సౌండ్స్ విన్న వెంటనే తలుపులు గనుక తీస్తే మోసపోయినట్టే. చెడ్డి గ్యాంగ్ చేతిలో ఈసీగా చిక్కినట్టే.
తలుపులు తీసిన వంటనే వారు లోనికి ఎంటరై వారి వద్ద ఉన్న ఆయుధాలతో బెదిరించి విలువైన వస్తువులు నగదు, నగలు తీసుకెళ్లిపోతారు. ఒక్కోసారి ఇంట్లోని వారిని హత్య చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ క్రమంలోనే చడ్డీ గ్యాంగ్ తిరుపతిలో రాత్రి సమయంలో మూసి ఉన్న మారుతి సుజుకి షో రూమ్ లోకి చొరబడ్డారు. ఇనుప రాడ్లు, ఆయుధాలు చేతపట్టుకుని లోపలి వెళ్లి అంతా కలియ తిరిగారు. అయితే వారికి షోరూం లో విలువైన సామాగ్రి ఏమి దొరక్కపోవడంతో వెళ్లిపోయారు.
ఇది ఒక రకమైన దుశ్చర్య అయితే తిరుపతి నగరంలో మరో రకమైన దుశ్చర్యలు ఎక్కువయ్యాయి. పుట్టిన రోజు వేడుకల పేరుతొ కాలేజీ కుర్రాళ్ళు అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళల్లో నడి రోడ్డు మీద బైకులు ఆపి, ఆ బైక్ మీద కేక్ పెట్టి కట్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
బర్త్ డే పార్టీ చేసుకోవడం తప్పు కాదు కానీ చేసుకునే ప్లేస్ కరెక్ట్ గా ఉంటె ఎవ్వరు దానిని తప్పు పట్టరు. కానీ నడిరోడ్డు మీద తాగి విచ్చలవిడిగా వీరంగం సృష్టిస్తుంటే అది వచ్చిపోయే వారికి ఆటంకంగా ఉంటుంది. పైగా పూటుగా తాగేసి ఉన్న ఈ కుర్రకారు రహదారులపై వెళ్లేవారితో వాగ్వాదం పెట్టుకోవడం, గొడవలకు దిగడం వంటివి కూడా చేస్తున్నారు. ఇటువంటి అనేకమైన ఘటనలు పోలీసు శాఖా= దృష్టికి రావడంతో తిరుపతి పోలీసులు అలర్ట్ అయ్యారు.
అర్ధరాత్రి సమయంలో ఎవరి ఇంటివద్ద అయినా కొత్త వ్యక్తులు అనుమానాస్పద రీతిలో సంచరిస్తూ ఉంటె వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి సమాచారం అందిచాలని చెబుతున్నారు. ఇక విద్యార్థుల విషయంలో కూడా వారు స్పందించారు. యువత పుట్టినరోజులు, ఇతరత్రా సరదాల పేరుతొ రోడ్లపై బైక్ రైడ్ చేసినా, తాగి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడినా కాలేజ్ నుండి డిబార్ చేయిస్తామని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. నగరంలోని శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పై పార్టీలు, సరద కార్యక్రమాలు పూర్తిగా నిషిద్దమన్నారు.