స్కూల్స్ దగ్గర అమ్మే చాక్లెట్స్ కొంటె మత్తు వచ్చి పడిపోతారు

WhatsApp Image 2024 03 14 at 1.07.39 PM స్కూల్స్ దగ్గర అమ్మే చాక్లెట్స్ కొంటె మత్తు వచ్చి పడిపోతారు

జంట నగరాలలో ఉండే స్కూల్స్ దగ్గర ఉండే చాక్లెట్స్ అమ్మే షాపుల మీద SOT పోలీసులు ఆకస్మిక దాడులు చేసి గంజాయి చాక్లెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 250 పాకెట్స్ ఉంటె బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే చాల ప్రాంతాలకు వాటిని సరఫరా చేసినట్లు ఆ షాపు యజమాని చెప్పాడు. అయితే ఇవి ఎక్కడ నుండి వస్తున్నాయని ఎంక్వయిరీ చెయ్యగా ఉత్తర్ ప్రదేశ్, బిహార్ నుండి వీటిని తీసుకొస్తున్నట్లు నిందుతుడు చెప్పాడని పోలీసులు చెప్పారు.

ఈ ఉదయం జీడిమెట్ల ప్రాంతం లో రైడ్ చెయ్య గా బిహార కు చెందిన సిబుకుమార్ అనే యువకుడు ఈ షాప్ ని నడుపుతూ చాక్లెట్స్ ముసుగు లో గంజాయి చాక్లెట్ లు తయారు చేసి చిన్న పిల్లలకు, అటో డ్రైవర్ లకు, కూలీలకు అమ్ముతున్నట్లు విచారణ లో తేలిందని పోలీసులు చెప్పారు.

ఇప్పటికే నగరం లో వివిధ ప్రాంతాలకు ముఖ్యం గా చిన్న పిల్లల స్కూల్స్ ఉన్న ప్రాంతంలో ఇవి ఎక్కువ అమ్ముడు అవుతాయి కాబట్టి ఆ ప్రాంతాలకు పంపినట్లు నిందితులు చెప్పారని ఆ ప్రాంతాలను పరిశీలించగా రామచంద్రాపురం బాలాజీ నగర్, నిజాంపేట లోని కొన్ని ప్రాంతాలకు సరఫరా జరిగినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు.

సాద్యమైనంత త్వరగా విచారణ చేపట్టి వాటిని స్వాధీనం చేసుకుంటామని పోలీసులు చెప్పారు. అయితే పోలీసులు చెప్పిన సూచనలు స్కూల్స్ వద్ద ఉన్న షాప్ లలో చాక్లెట్స్ కొనవద్దని చిన్న పిల్లల తల్లి తండ్రులను వారు హెచ్చరిస్తున్నారు.

Leave a Comment