CM camp office MCRHRD: సీఎం క్యాంపు ఆఫీస్ మారనుందా.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ.

CM camp office going to change.. Govt is planning to move it to MCRHRD..

CM camp office MCRHRD: సీఎం క్యాంపు ఆఫీస్ మారనుందా.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ.

ఎక్కువ శాతం సర్వేలు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సొంతగా ఏర్పాటు చేసుకునేంత స్థాయిలో సీట్లు సాధించింది.

ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా నాటి నుండే పరిపాలన ఎలా చేయాలి, ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అన్నదానిపై బాగా దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచి తాను ముఖ్యమంత్రి పదవి చేపడితే ఎం చెయ్యాలి అన్నదానిపై రేవంత్ రెడ్డి కూడా చాలా క్లారిటీతో ఉన్నారు.

కాబట్టి రాష్ట్రంలో పరిపాలనపై సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే మొన్నట్టు వరకు ప్రగతి భవన్ లోకి సామాన్యులకు ప్రవేశం ఉండేది కాదు,

కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ప్రగతి భవన్ లోకి సామాన్యులు నేరుగా వెళ్లి ముఖ్య మంత్రిని కలిసే అవకాశం కల్పించారు. ఇక ప్రగతి భావం పేరును కూడా జోతిరావు పూలె భవన్ గా పేరు మార్చారు.

సీఎం రేవంత్ హైదరాబాద్ లో ఉంటె ఖచ్చితంగా ప్రతి రోజు ఉదయం ప్రజలను కలుస్తూ వారి వద్ద వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. ఆయా పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు.

ఇది ఇలా ఉంటె రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటికీ జోతిరావు పూలె భావం గా పేరు మార్చబడిన ప్రగతి భవన్ కు తన మకాం మార్చలేదు.

ఇప్పటికి జూబ్లీహిల్స్ లోని తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. పెద్దమ్మ గుడికి సమీపంలో ఉండే ఆయన సొంత ఇంటి నుండే జోతిరావ్ పూలె భావం కి వస్తున్నారు.

ఇక ఇపుడు సీఎం క్యాంపు కార్యాలయాన్ని జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌ నుంచి ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీకి మార్చాలనే యోచనలో ఉన్నట్టు కాంగ్రెస్ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండే ప్రగతి భవన్ సీఎం క్యాంపు కార్యాలయంగా కొనసాగుతోంది.

గత సీఎం కేసీఆర్ బి.ఆర్.ఎస్ పార్టీ అహీకారం కోల్పోయిన రోజు వరకు అదే భవనం లో నివాసం ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో సీఎం క్యాంపు కార్యాలయం ఇదే భవనం లో కొనసాగించడం కుదరదని వారు భావిస్తున్నారు.

ప్రజా దర్బారు నిర్వహిస్తుండటం వల్ల జ్యోతిరావు పూలె భవన్ కొంత ఇరుకుగా, అసౌకర్యంగా మారుతోందని భావిస్తున్నారు. కాబట్టి సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీకి మార్చాలని నిర్ణయిస్తున్నారని తెలుస్తోంది.

ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో గుట్ట మీద ఉన్న బ్లాక్‌‌‌‌లోకి మార్చదానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు రేవంత్ సర్కారు హుకుం జారీ చేసింది.

ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ, ప్రభుత్వ ఉన్నతాధికారులతో డిసెంబర్ 12వ తేదీన భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం జ్యోతిరావు పూలె భవనం నుండి తరలించడం అనే దానిపై తుది నిర్ణయం ఉండనుంది.

ఇదే సమయంలో సీఎం రేవంత్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీని సందర్శించి అక్కడ ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాపై ఆరా తీశారు.

Leave a Comment