CM Jagan meet with KCR: తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావుని(Telangana Ex CM KCR) ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan) పరామర్శించారు.
ఎక్స్ సీఎం కేసీఆర్ డిసెంబర్ ఎదవా తేదీన ఎర్రవెల్లి లోని తన ఫామ్ హౌస్(Erravelli Form House) లో ప్రమాదవశాత్తు కాలు జారీ పడటం వల్ల అయన తుంటి ఎముక విరిగింది.
వెంటనే కేసీఆర్ ను కుటుంబ సభ్యులు హైదరాబాద్(Hyderabad) లోని సోమాజిగూడ లోగల యశోద ఆసుపత్రికి(Yasodha Hospital) తరలించారు.
కేసీఆర్ ను పరిశీలించిన వైద్యులు అయనకు సస్త్ర చికిత్స చేసి హిప్ రీప్లేస్‌మెంట్ చేశారు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో
ఉన్న కేసీఆర్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక బంజారా హిల్స్ లోని(Banjara hills) నంది నగర్ లో ఉన్న తన నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు.
కాగా కేసీఆర్ కి ప్రమాదం జరిగిన సమయంలోను , సస్త్ర చికిత్స చేసిన సమయంలోను ఏపీ సీఎం జగన్ కేసీఆర్ కుటుంబసభ్యులతో టచ్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నేరుగా అయన వద్దకే వెళ్లి ఆయన ఆరోగ్యానికి సంబంధించి పరామర్శించనున్నారు.
జగన్ కి బి.ఆర్.ఎస్ వర్గాల స్వగతం : BRS Leaders Well comes jagan
ఉదయం 10.30 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం(Gannavaram Airport) నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన జగన్ 11.15 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్(Begumpet Airport) కి చేరుకున్నారు.
అక్కడినుండి నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఇక జగన్ రాక నేపధ్యం లో బి.ఆర్.ఎస్ శ్రేణులు అన్ని రకాల ఏర్పాటు చేశాయి. జగన్ కు సాదరంగా స్వాగతం పలికి కేసీఆర్ వద్దకు తోడ్కొని వెళ్లారు.
కేసీఆర్, జగన్ ఒక ఒక గంటపాటు భేటీ కానున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. అంతేకాక జగన్ కు లంచ్ కూడా కేసీఆర్ ఏర్పాటు చేసినట్టు సమాచార.
ఎన్నికల తరువాత జగన్ తెలంగాణ రావడం ఇదే తొలిసారి : First time Jagan has come to Telangana after
వైసీపీ అధినేత జగన్(Jagan), బి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఇద్దరి మధ్య మంచి సయోధ్య ఉంది. వారిరువురు ముఖ్య మంత్రులుగా ఉన్న సమయంలో సహాయసహకారాలు ఒకరినుండి మరొకరు అందిపుచ్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
అయితే అనూహ్యంగా తెలంగాణ లో బి.ఆర్.ఎస్ పార్టీ ఓటమి పాలైంది. కేసీఆర్ చేతిలో నుండి పాలనా పగ్గాలు రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేతుల్లోకి వెళ్లాయి.
కాంగ్రెస్ పార్టీ(Congress) జయభేరి మ్రోగించి రేవంత్ రెడ్డిని సీఎం గా పాటించిన తరువాత జగన్ తెలంగాణ కి వచ్చిందే లేదు. అయితే రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జగన్ ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలియజేశారు. అందుకు రేవంత్ రెడీ కుడా సహ్రుద్భావం తోనే బదులిచ్చారు.
తాను కూడా అదే కోరుకుంటున్నానని ట్విట్టర్ లో రిప్లై ఇచ్చారు. ఆ సమయంలో వారిద్దరి ట్వీట్లు వైరల్ అయ్యాయి కూడా. ప్రస్తుతం ఆరోగ్య పరంగా కోలుకుంటున్న కేసీఆర్ తెలంగాణ లోక్ సభ ఎన్నికల నాటికి కోలుకుంటారని ఆ పార్టీ శ్రేణులు ఆంకాంక్షిస్తున్నాయి.