వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 11వ రోజు కొనసాగుతోంది. సోమవారం 11వ రోజు ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ పెన్షనర్లతో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా జగన్ పెన్షన్ లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. ప్రతీ అవ్వాతాత కొన్ని విషయాలు ఆలోచన చేయాలని.. మన ప్రభుత్వం రాకమునుపు పెన్షన్ ఎంత వచ్చింది? అంటూ ప్రశ్నించారు. 2019 ఎన్నికలకు ముందే పెన్షన్ వెయ్యి రూపాయలేనని.. దేశంలోనే మొట్టమొదటి సారిగా పెన్షన్ రూ.3వేలకు పెంచామన్నారు. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక రూ.3వేల పెన్షన్ వస్తుందని.. గ్రామ వాలంటీర్ ద్వారా ప్రతీనెల 1నే పెన్షన్ పంపిణీ చేస్తున్నామని వివరించారు.