CM Revanth Reddy Grand Entry: సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ ఎంట్రీ…

CM Revanth Reddy Grand Entry

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ గెలుపొందిందన్న విషయం తెలిసిందే.
ఈ విజయం మాములు విజయం కాదు . తెలంగాణలోని ఎన్నికల్లో 119 స్థానాలకుగాను 64 స్థానాలు గెలుచుకుంది కాంగ్రే. ఎన్నికల ఫలితాల తరువాత ముఖ్యమైన ఘట్టం మంత్రి వర్గం యొక్క ఏర్పాటు.
ఇక ఆ ప్రక్రియలోనే ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. గెలుపొందిన పార్టీ ముఖ్యులందరు కలిసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నిర్ణయించారు.

గురువారం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరం చేయనున్నారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అక్కడ పార్టీ పెద్దలైన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తదితరులను కలిసి తిరిగి హైదరాబాద్ కి తిరిగి వచ్చాక ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నాడు.


ఈ ప్రమాణస్వీకారానికి కాంగ్రేస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, దీపేందర్ తదితర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.


లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణస్వీకారం జరుగుతుంది.
హైదరాబాద్ నుంచే కాదు అనేక జిల్లాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంకి వస్తున్నారు.


కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి రానున్నారు.


రేవంత్ రెడ్డి మరియు దాదాపు ఐదు నుంచి ఆరు మంది మాత్రం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
భట్టి విక్రమార్క, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు తదితరులు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు ఉన్నతవర్గాల సమాచారం.

Leave a Comment