తెలంగాణా ముఖ్యంత్రికి హోళీ వేళ బుడతడు తో కాసేపు విరామం

website 6tvnews template 2024 03 26T125623.853 తెలంగాణా ముఖ్యంత్రికి హోళీ వేళ బుడతడు తో కాసేపు విరామం

నిన్న తెలంగాణా ప్రజలు రాష్ట్ర వ్యాప్తం గా ఎంతో ఆనందం గా హోళీ పండుగను జరుపుకున్నారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ జరుపుకున్నారు. ఇక విశేషం ఏంటంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవెంత్ రెడ్డి తన మనవడు రేయాన్స్ తో హైదరాబాద్ లో కలిసి హోళీ పండుగను జరుపుకొని ఆనందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కుడా ఈ హోళీ వేడుకలు జరుపుకున్నారు.

అలాగే CM సతీమణి గీత రెడ్డి కూడా హోళీ సంబరాలతో మనవడి తో కలిసి ఉత్సాహం గా పాల్గొన్నారు. మనవడు తాత ఒల్లో కుర్చుని ఉంటె ఆమె రంగులు చల్లుతూ ఆనందించారు. మనవడు రేయాన్స్ కుడా బాగానే ఎంజాయ్ చేసాడని ఇందుకు సంబందించి ఫోటోలు కూడా పోస్ట్ చేసారు ట్విట్టర్ లో. ఎప్పుడు ఒక్క క్షణం తీరిక లేని ముఖ్యమంత్రి ఇలా మనవడితో గడపడం కాసేపు విరామం లభించినట్లు అయింది.

WhatsApp Image 2024 03 26 at 10.52.28 AM 2 తెలంగాణా ముఖ్యంత్రికి హోళీ వేళ బుడతడు తో కాసేపు విరామం

మా ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాల వల్ల అటు సంక్షేమం తో పాటు అభివృద్ధి అనేది అందరి కుటుంబం లో ఆనందం అనేది రంగుల మయం కావాలి, ఒక విధం గా చెప్పాలంటే కుల మతాలకు అనే భేదం లేకుండా చేసుకునే పండుగ అని ఆయన అన్నారు. ఒక్క తెలంగాణా రాష్ట్రం ఒక్కటే కాకుండా మొత్తం దేశం అంతట ఈ హోళీ పండుగ సమయాన అందరు ఆనందం గా ఉండాలని ఆన్నారు. త్వరలోనే అందరికి ఆమోదయోగం అయ్యే విధం గా అన్ని వర్గాలకున్యాయం జరిగే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్ద వస్తుందని అని ఆయన ఆన్నారు. మరొక సారి అందరికి ఈ పండుగ రోజున హోళీ పండుగ శుభాకాంక్షలు చెప్తూ అందరి జీవితాలలో ఆనందం అనేది రంగుల మయం కావాలి ఆశాభావం వ్యక్తం చేసారు CM రేవెంత్ రెడ్డి.

Leave a Comment