Revanth Reddy: ప్రధాని నరేంద్ర మోడిని కలిసేందుకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి మొదటిసారిగా భారత ప్రధానిని తన అధికార హోదాలో కలవనున్నారు.
తెలంగాణ కి రావలసిన బకాయిలు, ఇతర విషయాలు చర్చించేందుకు న్యూ ఢిల్లీలో ఈ సమావేశ నిర్వహణ జరగనుంది.మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని, సిఎంకి అపాయింట్మెంట్ ఇచ్చారు.
మాజీ సిఎం తో ప్రధానికి క్షీణించిన సంబందాలు :
మాజీ సిఎం KCR ప్రధానిని సెప్టెంబరు 4, 2021లో చివరిసారిగా కలిశాడు.ఆ తరువాత అనేకానేక ఘర్షణల వల్ల వారి మధ్య ఉన్న సంబందాలు క్షీణించాయి.
ఆ తరువాత మాజీ సిఎం తో ప్రధానికి భేటీ ఎప్పడూ జరగలేదు.ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రధాని, కొత్త సిఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు.
ప్రధానితో రేవంత్ రెడ్డి సమావేశం :
తెలంగాణకు పెండింగ్ లో ఉన్న కేంద్రం యొక్క నిధుల విడుదల గురించి చర్చించాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం విడుదల చేయాల్సిన నిదుల గురించి చర్చించేందుకు సన్నద్దమయ్యారు,
అలాగే కేంద్ర ఆరోగ్య మిషన్ పథకం నిధులు, గ్రామీణాభివృద్ది పథకాలు, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పంచాయితీ రాజ్ నిధులు మంజూరు చేయవలసిందిగా ప్రధానమంత్రిని కోరనున్నారు.