CM Revanth Reddy Networth: సీఎం రేవంత్ రెడ్డి ఆస్తులు తెలిస్తే షాకే..

CM Revanth Reddy Networth

తెలంగాణ ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుండి తొలి ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు.

ఈ క్రమంలో నెటిజన్లు ఎక్కువ సెర్చ్ చేస్తున్న విషయాలు కొన్ని ఉన్నాయి, వాటిలో ప్రధానమైనవి చూసుకుంటే ఆయన నేపధ్యం, అతను ఏం చదువుకున్నాడు, పుట్టి పెరిగింది ఎక్కడ, అతని కుటుంబ నేపథ్యం ఏమిటి, పొలిటికల్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, రేవంత్ రెడ్డి ఎంత ఆస్తులు కూడబెట్టాడు అని వెతకడం మొదలు పెట్టారు.

ఒకప్పుడు పాలిటిక్స్ లో ఉన్న లీడర్లు పెద్దగా ఆస్తులు కూడబెట్టింది ఏమి ఉండేది కాదు, పైగా సామాన్య కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారు కూడా పొలిటికల్ లైఫ్ లోకి అడుగు పెట్టేవారు, అలాంటి వారు అధికారానికి దూరం అయ్యాక యధావిధిగా సాధారణ జీవితాన్ని గడిపేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. పాలిటిక్స్ అంటే అదొక ప్రొఫెషన్, పాలిటిక్స్ అంటే కొందరి దృష్టిలో అదొక బిజినెస్, పాలిటిక్స్ లో కి వచ్చేది అధికారం చలాయించడానికి, పెట్టిన పెట్టుబడికి రెండింతలు సంపాదించుకోవడానికి అన్నట్టు మారింది వ్యవహారం.

ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆస్తులు ఎంత ఉన్నాయి అనే దానిపై నెట్టింట సెర్చింగ్ మొదలైంది కాబట్టి అసలు రేవంత్ రెడ్డి ప్రస్థానం ఏమిటి అతను ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నాడు, అతని నేపధ్యం ఏమిటి ఎన్నెన్ని ఆస్తులు కూడబెట్టాడు అనే వివరాలు చూద్దాం.

రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి లో 1969 లో జన్మించాడు. పువ్వు విచ్చుకోకనే తెలుస్తుందట అది ఉల్లి పువ్వో మల్లెపువ్వో, అలాగే రేవంత్ రెడ్డి చిన్న నాటి నుండే లీడర్షిప్ క్వాలిటీస్ తోనే ఉండేవాడు.

కాలేజ్ డేస్ లో ఏబీవీపీ నాయకుడిగా ఉన్నాడు. అతని పెళ్లి కూడా పొలిటికల్ జోనర్ చుట్టూనే ముడిపడింది. అతని భార్య గీత మరెవరో కాదు, ఒకప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డికి మేనకోడలు. అయితే అంత పెద్ద పొలిటికల్ లీడర్ మేనకోడలిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతని ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అవ్వడం రేవంత్ కి పెద్ద కష్టం కాదు, కానీ అతను 2006 లో మేడ్చల్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా జెడ్ పి టీసీ మెంబర్ గా పోటీ చేసి గెలుపొందారు. ఆతరువాత 2007 లో ఎమ్మెల్సీ గా కాంటెస్ట్ చేసి సక్సెను అందుకున్నారు. అది కూడా ఇండిపెండెంట్ గానే పోటీ చేశారు.

పొలిటికల్ ప్రొఫెషన్ అంటేనే ఖర్చు తో కూడుకున్నది అని మనం ముందుగానే చెప్పుకున్నాం, అయితే ఎక్కడో కొండారెడ్డిపల్లె లో పుట్టి పెరిగిన రేవంత్ కి పోటికల్ గా నిలదొక్కుకోవడానికి జెడ్.పి.టి.సీ గా ఎంపీటీసీ గా గెలవడానికి అంత డబ్బు ఎలా వచ్చింది అని అనుమానం రావచ్చు, ఇక్కడే ఉంది అసలు కిటుకు, రేవంత్ రెడ్డి ఒక పక్క పాలిటిక్స్ లో ఉంటూనే మరో పక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తూనే ఉన్నాడు.

రియల్ ఎస్టేట్ బూమ్ పీక్స్ లో ఉన్న కోకాపేట లో రేవంత్ రెడ్డి జమానాలోనే తన ఫ్రెండ్స్ తో కలిసి 2000 సంవత్సరం కాలంలో గేటెడ్ కమ్యూనిటీ విల్లాను నిర్మించారట దాని పేరు మగదా విలేజ్ అని తెలుస్తోంది. 2000 – 2004 సంవత్సర కాలంలో ఒక వంద ఎకరాల మేర విస్తీర్ణంలో తన పార్ట్నర్స్ తో వెంచర్లు వేయడం, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు కట్టడం వంటివి చేసినట్టు తేలుస్తోంది.

ప్రస్తుతం రేవంత్ ఆస్తులు 30 కోట్లకి పైనే ఉంటుందని తెలుస్తోంది. అఫిడవిట్ లో పేర్కొన్నదాని ప్రకారం అతని వద్ద 5 లక్షల 34 వేల రూపాయలు నగదు ఉందట. ఇక ఈ ముప్పై కోట్ల ఆస్తులు అని ఏదైతే చెప్పుకున్నామో అందులోనే స్థిర చరాస్తులు ఉన్నట్టు వెల్లడించారు.

ఆస్తుల తో పాటు అప్పులు ఉండటం కూడా సహజమే, అయితే రేవంత్, గీత దంపతులకు అప్పు, ఒక కోటి ముప్పై లక్షల పైనే ఉంది. మరి సంపన్నుల భార్యల కి నగలు వెండి వస్తువులు వజ్రాభరణాలు ఉండటం పెద్ద గొప్ప విషయం కాదు. అలాంటివి వారి వద్ద లేకపోతేనే వింత.

అతని భార్య వద్ద ఒక కేజీ 235 గ్రాముల బంగారం ఉంది. దాని విలువ ప్రస్తుత మార్కెట్ ను బట్టి 83 లక్షల 36 వేలు ఉంటుందని అంచనా, అలాగే 7 లక్షలు పైనే విలువ చేసే వజ్రాభరణాలు కూడా ఉన్నాయి. ఇక వెండి విషయానికి వస్తే వీరి వద్ద 9,700 గ్రాముల వెండి ఉందట, అంటే దాదాపు 9 కిలోల 700 గ్రాముల వెండి అని చెప్పొచ్చు.

ఇక వీటితో పాటు రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ముఖ్యమైన ఆస్తులు రేవంత్ కి పెద్ద మొత్తంలో ఉన్నాయి, ఏవ్ పోలీస్ కేసులు. రేవంత్ రెడ్డిపై ఏకంగా 89 కేసులు ఉన్నాయి. అనేక సందర్భాల్లో అతనిపై పోలీసులు నమోదు చేసిన కేసులు మొత్తం కలుపుకుని 89 అయ్యాయి. ఒకప్పుడు రేవంత్ పై కేసులు సెంచరీ దాటిపోయాయని ఆయనే చెప్పుకుని చమత్కరించేవారు.

Leave a Comment