వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు : World Economic Forum conference
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు.
ఈ సమావేశం ప్రభుత్వం, వ్యాపార మరియు అంతర్జాతీయ సంస్థల నుండి నాయకులను స్వాగతిస్తుంది. ఇటువంటి ప్రఖ్యాత సదస్సులో ఆయన ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’ అనే అంశం గురించి ప్రస్తావించారు.
డిజిటల్ హెల్త్ కార్డులు : Digital health cards:
సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందించనున్నామని, ఈ మేరకు డిజిటల్ హెల్త్ కార్డులను రూపొందించే ప్రణాళిక లో ఉన్నట్టుగా సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఇక డిజిటల్ హెల్త్ కార్డుల డేటా భద్రతనూ, గోప్యతనూ కాపాడుతామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతికత సహాయంతో నాణ్యమైన వైద్యసేవలను అందిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ అత్యుత్తమ వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతోనే ఈ డిజిటల్ హెల్త్ కార్డని అన్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామని సీఏం రేవంత్ ప్రస్తావించారు.
హైదరాబాద్ ప్రస్తావన :
హైదరాబాద్ అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్‌వేర్ సేవలకు రాజధానిగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్ నగరంలోనే తయారవుతున్నాయని ఆయన అన్నారు.
ఆ వేదికపై తెలంగాణా, ముఖ్యంగా హైదరాబాద్ ప్రముఖ్యతని వివరించారు.