CM Revanth Reddy Sudden Decision: సీఎం రేవంత్ రెడ్డి సడన్ డెసిషన్..కోదండ రామ్ కు కీలక పదవి.

CM Revanth Reddy Sudden Decisions ..Key post for Kodanda Ram.

CM Revanth Reddy Sudden Decision: సీఎం రేవంత్ రెడ్డి సడన్ డెసిషన్..కోదండ రామ్ కు కీలక పదవి.

తెలంగాణ ఉద్యమం అనే సెంటిమెంట్ తో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారాన్ని చేపట్టింది అన్నది కాదనలేని నిజం. అయితే తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీల కన్నా టిఆర్.

ఎస్ పార్టీనే ఎక్కువ పాటు పడింది అన్నది కూడా ఒప్పుకోక తప్పని నిజం. ఇక ఆనాడు ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లిన వారిలో ప్రొఫెస్సర్ కోదండరామ్ కూడాఒకరు. సకలజనుల సమ్మె పేరుతో ఉద్యమానికి ఆజ్యం పోశారు.

కోదండరామ్ అనుభవాలను, ఆలోచనలను ఉద్యమం కోసం ఉపయోగించారు. కానీ కాల క్రమంలో కోదండరాం గులాబీ బాస్ తో విభేదించారు. ఆ క్రమంలోనే ప్రొఫెస్సర్ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ తో జత కట్టారు. తెలంగాణ ఎన్నికల్లో టీజేఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే పోటీ చేస్తాయని అనుకున్నారు.

కానీ కోదండరామ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 2023 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలుపుతుందని అన్నారు.

ఇక గతంలో రేవంత్ రెడ్డి ఒక సందర్భం లో మాట్లాడుతూ కోదండరామ్ అనుభవాలను, ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది అని అన్నారు.

అప్పుడు చెప్పిన మాట ప్రకారమే ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. కోదండరామ్ కు రేవంత్ రెడ్డి కీలకమైన బాధ్యతను అప్పగించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ప్రొఫెస్సర్ కోదండరామ్ ను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం కాక ముందు కూడా రేవంత్ రెడ్డి, కోదండ రామ్ అనేకమార్లు కలుసుకున్నారు.

ఇది ఇలా ఉండగా రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో మరో కీలక నేత విషయం లో ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెస్సర్ జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా గుర్తించారు.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రాథమిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. అక్కంపేట గ్రామం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఉంది.

అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి-బి గ్రామంలో ఉన్న అమరవీరుల స్తూపానికి చేరువలో ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సుందరీకరించాలని నిర్ణయం తీసుకున్నారు.

Leave a Comment