కుమారి ఆంటీ హోటల్ కి సీఎం రేవంత్ : CM Revanth Reddy will Visit Kumari Aunty Hotel

website 6tvnews template 2024 01 31T163727.948 కుమారి ఆంటీ హోటల్ కి సీఎం రేవంత్ : CM Revanth Reddy will Visit Kumari Aunty Hotel

కుమారి ఆంటీ(Kumari Aunty Hotel), కుమారి ఆంటీ, గడిచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే మాట, ఎక్కడ విన్నా ఇదే మాట.

ఆమె పేరు సామాజిక మాధ్యమాలలో ట్రెండింగ్ గా మారిపోయింది. ఆమె ఇటీవలి కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల ఆమె పై కాంగ్రెస్ పార్టీ కక్ష పెంచుకుంది అని అందుకే ఆమె ఫుడ్ స్టాల్ ను మూసివేయిస్తోందని అంటూ రకాల రకాల వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే అసలు కారణం ఏమిటంటే ఆమె రోడ్డు పక్కన పెట్టిన తన ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఎదురవుతోందని అందుకే ఆ స్టాల్ ను పోలీసులు తీసి వేయించినట్టు తెలిసింది.

సోషల్ మీడియా లో కుమారి ఆంటీకి సపోర్ట్ : Kumari Aunty got Support from social media

KUmari aunty revanth కుమారి ఆంటీ హోటల్ కి సీఎం రేవంత్ : CM Revanth Reddy will Visit Kumari Aunty Hotel

ఎప్పుడైతే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ తీసివేయించారో సోషల్ మీడియా లో ఆమె సపోర్టార్స్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఎంతలా అంటే ఆ విషయం ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్లేంతలా వైరల్ చేశారు.

దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించారు. ఆమె స్టాల్ ను తీస్యవద్దని, ఇంతకుముందు ఎక్కడైతే ఉందొ ఇప్పుడు కూడా అక్కడే పెట్టుకునేలా అనుమతి ఇవ్వాలని ఆదేశించారు.

పైగా ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలుగకుండా చూసుకోవలసిన బాధ్యత పోలీసు యంత్రాంగానికే అప్పగించారు.

అది కాంగ్రెస్ పార్టీ విధానమే కాదన్న సీఎం రేవంత్ : CM Revanth said that it is not the policy of the Congress party

కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా స్వయం ఉపాధితో జీవనాన్ని గడుపుతున్న పేదవారికి ఇబ్బంది కలిగించదని, అవసరం ఉన్న వారికి ఆర్ధికంగా మడ్డకు కల్పిస్తుంది తప్ప వారి జీవన విధానానికి విఘాతం గా ప్రవర్తించదని చెప్పారు.

పైగా సమయం చూసుకుని తాను తప్పకుండ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్లి కలుస్తానని అన్నారు. ఇక ఏకంగా సీఎం నుండి ఆదేశాలు రావడంతో కుమారి ఆంటీ నేడు తన హోటల్ ను మరోమారు రీ ఓపెన్ చేశారు. సాధారణ రోజుల్లో వచ్చే జనం కన్నా నేడు మరింత మంది ఎక్కువగా వచ్చారు.

Leave a Comment