CM Revanth Reddy: నేడే తెలంగాణ CM గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ ను సైతం దాటేసి..64 స్థానాలలో ఘన విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో సంచలనమైన తీర్పును తెలంగాణ ప్రజలు అందించారని అధికార వర్గాలు తెలిపాయి..
ఎంత మంచి మార్పును కోరిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించడమే లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. ఇంత భారీ
మెజార్టీ సీట్లు సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. గవర్నర్ తమిళిసైని కలిసిన ఆ పార్టీ ప్రతినిధులు ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని లాంచనాలతో సిద్ధమైనట్లు సమాచారం.
అయితే, నేడు సీఎల్పీ సమావేశం నిర్వహించి.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఆ సమాచారాన్ని గవర్నర్‌కు అందిస్తారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
భట్టి విక్రమార్కతోపాటు పలువురు ఆ పదవికి పోటీ పడుతున్న నేపథ్యంలో.. సీఎల్పీ భేటీ తర్వాతే ముఖ్యమంత్రి ఎవరనేది అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకార ఘట్టంపై దృష్టిసారించనున్నారు.అధికార వర్గాలు వెల్లడించాయి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 65 సీట్లతో జయభేరి మోగించిన కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది.
సెంబరు 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని గతంలో పలు సందర్భాల్లో రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే, అంతకంటే ముందే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్‌లోనే మకాం వేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకురాలు దీపాదాస్‌మున్షీ, ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి తదితరులు ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశ ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సమావేశానికి డీకే శివకుమార్, బోసురాజు, అజయ్‌కుమార్, జార్జ్, దీపాదాస్‌మున్షీలు పరిశీలకులుగా హాజరవుతారు. ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత సీఎల్పీ చేసిన తీర్మానాన్ని కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపిస్తారు.
అక్కడి నుంచి వచ్చే సీఎం పేరును ఎమ్మెల్యేలకు చెప్పి అనంతరం గవర్నర్‌ను కలిసి అందజేస్తారు. మరోవైపు ఎన్నికల సంఘం సీఈఓ వికాస్‌రాజ్ ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసి గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను సమర్పిస్తారు. ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ కార్యక్రమం ఉంటుంది