Hyderabad Metro Expansion: హైదరాబాద్(Hyderabad) నగరంలో మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన అనంతరం కొంత వరకు బస్సుల్లో రద్దీ తగ్గింది,
అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గంటల తరబడి బస్సుల్లో నిలబడి ఉండటానికి బదులు మెట్రో రైలులో రయ్ మంటూ దూసుకెళ్ళి పోతూ హాయిగా ఆఫీస్ నుండి ఇంటికి చేరుకోవడం,
లేదంటే షాపింగులకు వెళ్లి ఎంజాయ్ చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ మెట్రో హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో లేదు.
కేవలం నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి ఈ మెట్రో ను నగరంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాలని, నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తొలగించాలని తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వం(Telangana Congress Government) భావిస్తోంది.
ఈక్రమం లోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో భేటీ అయ్యి మెట్రో విస్తరణ పై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెట్రో విస్తరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మెట్రో విస్తరపై సీఎం రేవంత్ : CM Revanth on metro expansion
కొత్తగా ఏర్పాటు చేయబోయే మెట్రో నిర్మాణం హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా ఉండాలని చెప్పారు సీఎం రేవంత్ (CM Revanth).
ప్రతిపాదనలు కూడా దానికి అనుగుణంగానే ఉండాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రెండు, మూడవ దశ నిర్మాణాలపై సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
భవిష్యత్తులో చేపట్టబోయే నిర్మాణాల ప్రణాళిక కోసం మెట్రో రైలు ఎండి హెచ్ఎండీఏ(HMDA) కమిషనర్ ఇద్దరు పరస్పరం సమన్వయము కుదుర్చుకోవలనన్నారు.
ఓల్డ్ సిటీ డెవలప్ అవ్వాలి : Old City Development Also Important
మెట్రో విస్తార నేపథ్యంలో హెచ్ఎంఆర్ఎల్(HMRL) ఒక ప్రతిపాదన చేసింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ దారుల్ షిఫా జంక్షన్(Darulshahi Junction) నుంచి షాలిబండ(Shalibanda) వరకు ఉన్న మెట్రో స్టెచ్ మార్గాన్ని అలాగే అక్కడి రోడ్డును కూడా విస్తరించాలని కోరింది.
దీంతో సీఎం రేవంత్(CM Revanth) అక్కడి రోడ్డును 100 అడుగుల రోడ్డుగా మార్చేందుకు ఉన్న సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని చెప్పారు.
ఇలా చేయడం వల్ల ఓల్డ్ సిటీ చాల వేగంగా డెవలప్ అయ్యేందుకు అవకాశం కూడా ఉందన్నారు. అయితే ఓల్డ్ సిటీ లో ముఖ్యమైన 103 నిర్మాణాలు ఉన్నాయని అన్నారు.
అవి మతపరమైనవి అలాగే వారసత్వపరమైనవి కూడా అని చెప్పారు. కాబట్టి వాటికి ఎక్కడ కూడా ఇబ్బంది కలుగకుండా మెట్రో మార్గాన్ని రూపొందించాలని చెప్పారు.
ఈ విషయంలో తాను కూడా అవసరమున్న సమయంలో ఓల్డ్ సిటీ లో ఉన్న నాయకులూ, ప్రజాప్రతినిధులతో సమావేశమై చర్చిస్తానని అన్నారు.
రాయదుర్గం RGI మెట్రోకీ బ్రేక్ : Sudden Break For Rayadurgam RGI Metro Project
ఇక గతంలోబి.ఆర్.ఎస్(BRS)ప్రభుత్వంరాయదుర్గం(Rayadurgam)ఉందిశంషాబాద్విమానాశ్రయం(Samshabad Airport) వరకు మెట్రో రైలును పొడిగించాలని ప్లాన్ చేసింది.
దాని నిర్మాణ వ్యయం అంచనా 6250 కోట్ల రూపాయలు. అయితే రేవంత్ సర్కారు ఆ మెట్రో మార్గానికి బ్రేకులు వేసింది. 31 కిలోమీటర్లు ఉన్న ఆ మెట్రో ప్లాన్ ను తాత్కాలికంగా నిలిపివేసింది.
అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్(Rajiv Gandhi International Airport) కు మహాత్మా గాంధీ బస్టాండ్ నుండి ఓల్డ్ సిటీ(Old City) మీదుగా మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలనీ చెప్పారు.
ఇక పొతే రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు కూడా వెడల్పుగా, విశాలంగా ఉండే ఔటర్ రింగ్(Outer Ring Road) రోడ్డు ఉందని గుర్తుచేశారు. కాబట్టి MGBS – OLD CITY – RGI మెట్రో మార్గం పై దృష్టి పెట్టాలని అన్నారు.
తక్కువ ఖర్చుతో పూర్తయ్యేలా ఉండాలి : It should be done at low cost
ప్రస్తుతం నగరంలోని మెట్రో కారిడార్లు(Metro Corridors) ఏవైతే ఉన్నాయో వాటికి అనుబంధంగా, సమీపంలో ఉండే ప్రాంతాలకు మెట్రో ను విస్తరించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని,
పైగా నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా మెట్రో విస్తరణ చాల ఆవశ్యకమని చెప్పారు. అయితే ఈ విస్తరణ లో కొత్తగా వస్తున్నా మెట్రో ఏదైతే ఉందొ అది తక్కువ ఖర్చుతో పూర్తయ్యేలా ప్రణాళిక చేపట్టాలన్నారు.
కొత్తగా వస్తున్న మెట్రో మార్గాలు : New metro lines coming up
కొత్తగా ప్రతిపాదనలో ఉన్న మెట్రో మార్గాలు ఏమిటి అనేది చుస్తే, మొదటిది మియాపూర్, ఇప్పటివరకు మెట్రో మియాపూర్ తో ఎండ్ అవుతోంది, అయితే ఇకమీలేదట దీనిని చందానగర్, బిహెచ్ఈఎల్ పఠాన్ చెరు వరకు పొడిగించాలని ప్రతిపాదన ఉంది
దేని దూరం 14 కిలోమీటర్లు. ఈ ప్రాంతాల నుండి నిత్యం అనేక మంది ప్రజలు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు.
రెండవది ఎంజిబిఎస్ నుండి ఫలకనామ – చాంద్రాయణగుట్ట – మైలార్దేవ్ పల్లి – పి 7 రోడ్డు-శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దీని మొత్తం దూరం 23 కిలోమీటర్లు. ఈ మార్గం ఓల్డ్ సిటీ లోని అనేక ప్రాంతాలను కలుపుతూ ఎంజిబిఎస్ నుండి ఎయిర్ పోర్ట్ వరకు వెళుతుంది.
నగరంలోని అనేక మంది ప్రతి రోజు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళుతూ ఉంటారు. మెట్రో గనుక అందుబాటులోకి వస్తే వారికి చాల ఉపయోగకరంగా ఉంటుంది.
మూడవది నాగోల్ – ఎల్బీనగర్ – ఒవైసీ ఆసుపత్రి – చాంద్రాయణ గుట్ట – మైలార్ దేవ్ పల్లి -ఆరాంఘర్ – కొత్త హై కోర్ట్. దీని దూరం 19 కిలోమీటర్లు. నాలుగవది ఇది కారిడార్ 3 లో భాగంగా రూపొందించబడుతుంది.
ఇది రాయదుర్గం నుండి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఉంటుంది. దీని మొత్తం దూరం 12 కిలోమీయేటర్లు. ఈ మెట్రో లైన్ బైడైఓవర్సీటీ జంక్షన్,
ట్రిపుల్ ఐటి జంక్షన్, ఐఎస్ బి రోడ్లను కలుపుతుంది. ఐదవది ఎల్బీనగర్, వనస్థలి పురం, హయత్ నగర్ మాగ్రామ్ ఉంది దీని మొత్తం దూరం 8 కిలోమీటర్లు.
శామీర్ పేట్ వరకు మెట్రో : Metro to Sameerpet
అదే విధంగా శ్రీశైలం హై వే, ఎయిర్ పోర్ట్ ప్రాంతం నుండి కందుకూరు వరకు మెట్రో రైలు కనెక్షన్ ఉండేలా ప్లానింగ్ రెడీ చేయాలన్నారు. ఆ ప్రాంతంలోనే ఫార్మాసిటీ కోసం భూసేకరణ కరిగిందని,
కాబట్టి అక్కడ మెట్రో సేవల ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఇక మూడవ దశ మెట్రో పనుల్లో భాగంగా, జూబ్లీ బాస్ స్టేషన్(Jubli bus stand) నుండి సమీర్ పేట(Sameerpet) వరకు మెట్రో అందుబాటులోకి రావాలని సూచించారు.