BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నిన్న ఒక బహిరంగ సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక మొదట గా చేరేది రేవెంత్ రెడ్డి అని ఆయన ఆరోపించారు, కాంగ్రెస్ పెద్దలు ఒక పక్కన మోడీ గురుంచి తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటే ఈ రేవంత్ రెడ్డి మోడీ గారు మా బడా భాయ్ అని చాలా మంచి వాడని అంటున్నారు. అంతే కాదు కాంగ్రెస్ లో ఉన్న రాహుల్ గాంధి చౌకిదార్ చోర్ అంటూ ఉంటె మా బడా భాయ్ ఎప్పుడు బావుండాలి అంటున్నాడు. వారి పార్టి లోనే ఉంటూ ఇలా ఇంకొక పార్టీ నేతని ఎవరైనా మెచ్చుకుంటార అని KTR విమర్శించారు. ఈ సారి కాంగ్రెస్స్ పార్టీ కి ఎలేక్షన్స్ లో 40 సీట్లు కుడా రావడం కష్టం అని ఆయన అన్నారు.
అంటే కాదు కాంగ్రెస్ నాయకులు అటు అధానీని, అమ్బానీని విమర్శిస్తూ ఉంటె వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు అని అంటున్నాడు రేవంత్. మొన్న రాహుల్ గాంధి గుజరాత్ మోడల్ ని దుర్మార్గం అని అంటే మా బదేభాయ్ మోడల్ చాలా బావుందని అన్నాడని దీన్ని బట్టే తెలుస్తోంది అని ఇక రేవెంత్ రెడ్డి BJP లోకి వెళ్ళడం ఖాయం అని. ఏది ఏమైనా మన పార్టీ నాయకులను ఈ ఎలక్షన్స్ లో మనం గెలుపించుకోవాలి అని ఆయన పిలుపు ఇచ్చారు. అలాగే అవకాశ రాజకీయాల కోసం దానం కాంగ్రెస్ పార్టీ లో చేరారు అని ఆయన విమర్శించారు. ఆయన అసెంబ్లీ లో MLA గా ఉండడానికి వీలు లేదని ఆయన అర్హతను రద్దు చేయాలని స్పీకర్ ని కోరతాం అని ఆయన అన్నారు.