తెలంగాణ ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్ బి స్టేడియం ను తీర్చి దిద్దుతున్నారు. ఏ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్ బి స్టేడియం ను ఎంచుకోవడానికి కారణం కూడా లేకపోలేదు.
రేవంత్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రం ఇండిపెండెంట్ గా చేసినప్పటికీ తొలిసారి ఎమ్మెల్యే అయింది మాత్రం తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీదే.
ఇక ఆపార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు, అలాగే ప్రస్తుతం రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ పార్టీ లోని నాయకుడు వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా వారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇదే ఎల్ బి స్టేడియం లో చేశారు.
కాబట్టి రేవంత్ కూడా ప్రజల్లో వారి స్థాయి లో మంచి పరిపాలన అందించి గుర్తింపు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ ఎల్బీ స్టేడియం ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహన రాకపోకలపై పలు ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్టేడియం పరిసరాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలుస్తోంది.
స్థానిక ఏఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ నుండి వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి, చాపెల్ రోడ్డువైపు మళ్లించనున్నారు. గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ నుంచి బీజేఆర్ కూడలి వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డులోకి వెళ్లేలా చూస్తారు. బషీర్‌బాగ్ జంక్షన్ నుండి బీజేఆర్ జంక్షన్ వైపు గా వచ్చే వాహనాలను కింగ్ కోఠీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రోడ్ల వైపు వెళ్లేలా చర్యలు చేపట్టారు.
మరోవైపు పంజాగుట్ట, వి.వి. స్టాట్యూ జంక్షన్, రాజీవ్‌గాంధీ స్టాట్యూ, నిరంకారి, పాత సైఫాబాద్ ఠాణా, లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, ట్రాఫిక్ పోలీసు కాంప్లెక్స్, బషీర్‌బాగ్, పిజేఆర్ స్టాట్యూ కూడలి, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ, అబిడ్స్ సర్కిల్, ఏఆర్ పెట్రోల్ బంక్, లిబర్టీ, హిమాయత్ నగర్, అసెంబ్లీ, మోజం జాహి మార్కెట్, హైదర్‌గూడ కూడళ్ల వైపు వెళ్లే పనులు ఉంటె సాయంత్రం వరకు వాయిదా వేసుకోవాలని పోలీసుల సూచించారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి తొలి సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్ననేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు సంబరాలు చేసుకున్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సందడి వాతావరణం నెలకొంది.
దానికి కారణం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వ్యక్తి కావడంతో అక్కడ ఉన్న అయన ఫాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు లే అనుకుంటే మీరు పప్పు లో కాలేసినట్టే, రేవంత్ రెడ్డి కి భీమవరంలో బంధువులు ఉన్నారు అని చాల తక్కువ మందికి తెలుసు. రేవంత్ రెడ్డి కుమార్తెను ఇచ్చింది రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ షోరూం అధినేత వెంకటరెడ్డి కుమారుడికే.
వారి వ్యాపార కలాపాలు ఎక్కడైనా ఉంది ఉండొచ్చు కానీ, వారి స్వస్థలం మాత్రం భీమవరమే, ఆందుకే ఎన్నికల లెక్కింపు నాటి నుండి ఆ గ్రామం లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయగానే ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఇక తాజాగా సీఎం అభ్యర్థి గా రేవంత్ పేరు ఖరారవ్వగానే ఆ ఊరిలో తపాలా మోత మోగించారు. బాణా సంచా మోతతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు.
సాధారణంగా ఏ వ్యక్తి అయినా సీఎం అవ్వగానే అధికార దర్పాన్ని ప్రదర్శిస్తారు, కానీ రేవంత్ రెడ్డి మొదటి నుండి చెబుతున్న మాట ఒకటే ఈ పదవి ప్రజాసేవ చేసేందుకే కానీ, అహంభావాన్ని చూపెట్టేందుకు కాదని అనే వారు. తానూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.
ప్రగతి భవన్ అంటే రాజప్రాసాదం లా కాకుండా ప్రజలకు అనుమతి ఇచ్చే విధంగా ఉండేది కావాలని అన్నారు. తన హయాంలో అలానే ఉండేలా చూస్తానని చెప్పారు. అయితే ఇదే క్రమంలో ఒకో ఆశక్తికర ఘటన చోటుచేసుకుంది. నిన్న హస్తినకు వెళ్లిన రేవంత్ ఢిల్లీ పెద్దలను కలిసి వారితో మాట్లాడి వారి ఆశీర్వాదం తీసుకుని వచ్చారు.
రేవంత్ హైదరాబాద్ చేసుకునే సమయానికి రాష్ట్రి 10 గంటలు దాటింది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్ కు స్వాగతం పలికేందుకు కాన్వాయ్ తో సహా సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా తో పాటు కొందరు అధికారులు అక్కడికి చేరుకున్నారు.
అయితే తన నివాసానికి బయలుదేరిన రేవంత్ ను కాన్వాయ్ లో వెళ్లాలని అధికారులు కోరగా అందుకు రేవంత్ నిరాకరించారు. సొంత వాహనంలో మాణిక్‌రావ్ ఠాక్రేతో కలిసి గబ్బిబౌలిలోని ఎల్లా హోటల్‌కు వెళ్లారు. కానీ ప్రతి కాల్ ను ఫాలో అవ్వాలి కాబట్టి రేవంత్ వాహనాన్ని ఫాలో అవుతూ వెళ్ళింది కాన్వాయ్.