ఈరోజుల్లో మోసగాళ్ళు ఎన్నిదారుల్లో మోసాలు చేయచ్చో అన్ని వాడేస్తున్నారు. వీళ్ళు చేసిన మోసాలు సినిమా కధలకు ఏ మాత్రం తీసిపోవు. అలాంటి మోసం ఒకటి భయట విశాఖ లో. ఇక వివరాలలోకి వెళ్తే ఇద్దరు ప్రేమికులు సరికొత్త మోసానికి తెర తీసారు. ఇద్దరు కలిసి పోలీసు డ్రెస్ లు వేసుకుని అక్కడ పలు రకాల మోసాలు చేసారు.
అంతే కాదు ఈ జంట మా పలుకుబడి ఉపయోగించి పోలీస్ జాబ్ లు కుడా వెయ్యించ గలమని అక్కడ నిరుద్యోగులను నమ్మించారు. అంతే కాదు ఈ ఇద్దరు ప్రేమికులు పోలీసు డ్రెస్ లు వేసుకుని నిజమైన పోలీసులు గా హల్చల్ చెయ్యడం తో అక్కడ వారు ఇజి గా నమ్మేశారు వీరిని. అంతే కాదు ఒక బొమ్మ తుపాకి పట్టుకుని పలువురిని బెదిరించి అందిన కాడికి డబ్బులు వాసులు చేస్తూ దందాలు చెయ్యడం మొదలు పెట్టారు.
వీళ్ళు జరిమానా రూపం లోనే కాక ఉద్యోగాల పేరుతో దాదాపు 3 కోట్లు వరకు వసూళ్ళు చేసారు. వీరి చేతిలో మోసపోయిన వారు ఇచ్చిన సమాచారం తో వీరి మీద నిఘా పెట్టగ వీరు దొంగ పోలీసులు అని తేలింది. రంగం లోకి దిగిన పోలీసులు వీరికోసం వెతకగా హైదరాబాద్ లో తలదాచుకున్నట్లు సమాచారం మేరకు కమీషనర్ ఆదేశాలతో బృందాలు గా విడిపోయి వారిని పట్టుకుని అరెస్ట్ చేసి విశాఖ కు తీసుకొచ్చారు.
ఇప్పుడు వీరిద్దరిని రహస్యం గ ఉంచి ఎంక్వయిరీ చేసున్నారు పోలీసులు. నిందుతుడు కి ఇదివరకే పెళ్లి అయ్యిందని ఇద్దరినీ ( అక్కాచెల్లలు ) పెళ్లి చేసుకున్నట్లు మా విచారణ లో తేలిందని చెప్పారు. ఇప్పుడు ఇతను తో ఉన్న అమ్మాయి ని ఒక పావుగా ( సహజీవనం) వాడుకుని మోసాలు చెయ్యడం మొదలు పెట్టాడు. కేసు దుర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.