రండి బాబు రండి వచ్చి మీ మొబైల్ ఫోన్లు తీసుకెళ్ళండి

WhatsApp Image 2024 03 14 at 12.34.51 PM 2 రండి బాబు రండి వచ్చి మీ మొబైల్ ఫోన్లు తీసుకెళ్ళండి


ఏంటి టైటిల్ చూసి ఇదేంటి టా అనుకుంటున్నారా ! లేదా ఫోటో చూసి ఏదైనా మొబైల్ ఎగ్జిబిషన్ అనుకుంటున్నారా ! ఎం లేదండి ఇటీవల ఏలూరు లో ఒక ప్రెస్ మీట్ జరిగింది. పోలీసులు చెప్పిన వివరాలు విని ఆశ్చర్య పోయారు అక్కడకి వచ్చిన వారందరూ.

దాదాపు 6 నెలల కాలం లో ఏలూరు కమీషనరేట్ ఏరియా లో చాల మంది వారి మొబైల్ ఫోన్లు పోగట్టు కున్నారు. దొంగలు కొట్టేసినవి కావచ్చు లేదా వేరే వాళ్ళు దగ్గర మరిచి పోయి వదిలేసి ఉండవచ్చు. ఇప్పుడు పోలీసులు వారికి వచ్చిన కంప్లైంట్ లు ఆధారం గా ఎంక్వయిరీ చెయ్యడం మొదలుపెట్టారు. దీనికి వీరు అత్యాధుని సాఫ్ట్ వేర్ లు ఉపయోగించి పోయిన మొబైల్ ఫోన్ లని రీకవరీ చేసారు. దీనికి వారు చాట్ బాట్ అనే ఆప్షన్ ద్వార రికవరీ చేసారు.

రికవరీ చేసిన మొబైల్ ఫోన్ లను కంట్రోల్ రూమ్ లో మొబైల్ యజమానులకు అప్పగించారు. అయితే చార్ బాట్ సేవలు మొదలు పెట్టిన కొన్ని రోజుల్లోనే దాదాపు 300 మొబైల్ ఫోన్ లను రికవరీ చేసి యజమానులకు అందజేసమని పోలీసులు చెప్పారు.

ఇప్పటి వరకు రికవరీ చేసిన మొబైల్ ఫోన్ ల విలువ దాదాపు కోటి రూపాయలు వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు. అలాగే ఇప్పటి వరకు 628 మొబైల్ ఫోన్ లను రికవరీ చేసి యహమానులకు అందించినట్లు పోలీసులు చెప్పారు. ఎవరైనా ఆంధ్ర ప్రాంతం లో మొబైల్ ఫోన్ చోరి జరిగినట్లయితే ఈ ఫోన్ నెంబర్ 94406 27057 కి హాయ్ ని మెస్సేజ్ పంపినట్లయితే వెంటనే గూగుల్ పేజి లింక్ ఓపెన్ అవుతుందని, అప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేసి పోయిన మొబైల్ ఫోన్ వివరాలు అందించి నట్లయితే మా వద్ద ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ని గుర్తిస్తామని వారు చెప్పారు.

అలాగే ఎవరైనా సెకండ్ హాండ్ మొబైల్ కొనేటప్పుడు చాల జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెప్తున్నారు. డబ్బులు అవసరం అయి మా దగ్గర ఉన్న ఖరీదైన మొబైల్ ఫోన్ ని అతి తక్కువ ధరకు మొబైల్ ఫోన్ అమ్ముతున్నామని చెప్పేవారే దొంగలు అని అలాంటివారి వద్ద మొబైల్ ఫోన్ కొని మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Leave a Comment