Kalki 2898 AD: ప్రేక్షకుల ముందుకి రానున్న..కల్కి 2898 AD.
కల్కి 2898 AD అనేది రాబోయే భారతీయ ఇతిహాస సైన్స్ ఫిక్షన్ డిస్తోపియన్ చిత్రం.
వైజయంతీ మూవీస్ యొక్క సి. అశ్వినీ దత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా, నాగ్ అశ్విన్ రచించి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూడటానికి మరో కారణం ఈ సినిమాలో హీరోగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడు.
ప్రభాస్ నుంచి మంచి హిట్టు కోసం అభిమానగణం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. బాహుబలి లాంటి భారీ విజయం తరువాత ప్రభాస్ కి ఒక్క సరైన హిట్టు లేదు. ఇపుడు ప్రేక్షకుల ముందుకి రానున్న సలార్ పైన ప్రేక్షకుల అంచనాలు అధికంగా ఉన్నాయి.
ఇక సలార్ తరువాత ప్రభాస్ పూర్తి స్థాయిలో పని చేసేది ఈ కల్కి సినిమాకే.
కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే మరియు దిశా పటాని లాంటి అగ్ర తారలు ఈ సినిమాలో నటిస్తున్నారు.
2024 లో రానున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా తెలుగు, హిందీ రెండు భాషల్లో విడుదల అవుతుంది.
ఈ సినిమా 2020 లో ప్రాజెక్ట్ కె పేరుతో ప్రకటించారు.
అయితే కరొనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఒక సంవత్సరం ఆలస్యం అయింది. 2021 లో ఈ సినిమా చిత్రీకరణ మొదలు అయ్యింది.పూర్తిగా 600 కోట్ల బడ్జెట్ తో రూపొందించే ఈ సినిమా అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలలో ఒకటి.