Kalki Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్, కల్కీ రిలీజ్ అప్పుడే

Kalki Release Date

Kalki Release Date: సలార్‌ (Salaar)సినిమాతో బాక్సాఫీస్ దుమ్ముదులిపేశాడు ప్రభాస్‌ (Prabhas). బాలీవుడ్ మూవీ డంకీ (Dunki)కి సైతం గట్టి పోటీ ఇచ్చి ఏడు వందల కోట్ల కలెక్షన్లకు చేరువ అయ్యింది. ఇంకా ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.

ప్రభాస్ భారీ కటౌట్ , ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neil)టేకింగ్‌, బీజీఎం సలార్‎ను వేరే లెవల్‌కి తీసుకెళ్లింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మధ్యనే సినిమా సక్సెస్‌ ను టీం సభ్యులు సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇక ప్రస్తుతం ప్రభాస్‌ రెండు ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. ఒంకటి మారుతి (Maruthi)డైరెక్షన్‎లో రూపొందుతున్న మూవీకాగా మరొకటి నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin)తో చేస్తున్న కల్కీ2898ఏడీ (Kalki 2898ad) సినిమా. ప్రస్తుతం కల్కీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది(Kalki Release Date). అతిభారీ బడ్జెట్‎తో భారీ కాస్టింగ్‌తో, భారీ టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో తీస్తున్న మూవీ కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.

వాస్తవానికి ఈ మూవీని మేకర్స్ సంక్రాంతికే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇంకా పనులు పూర్తికాకపోవడంతో ఆ నిర్ణయాన్ని పోస్ట్ పోన్ చేశారు.

అయితే తాజాగా కల్కీ కొత్త రిలీజ్‌ డేట్‌‎పై ఓ ఇంట్రెస్టింగ్ అప్‎డేట్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా కల్కీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ హిట్‌ సెంటిమెంట్‌ డేట్‌కే కల్కీని రిలీజ్ చేయాలని అశ్వినీ దత్‌ (Ashwini Datt) భావిస్తున్నారట.

Kalki movie project budget Rs.600 crores : రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో కల్కీ

Kalki Release Date
Kalki Release Date

వైజయంతీ మూవీస్ (Vaijayanthi Movies)పతాకంపై నిర్మాత అశ్వినీదత్ (Ashwini Datt) రూ.600 కోట్ల అతిభారీ బడ్జెట్‌తో ‘కల్కీ’ (Kalki) సినిమాను తెరకెక్కిస్తున్నారు.

భారత్ లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతోన్న సినిమా ఇది కావడంతో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు(Kalki Release Date). మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin)కల్కీ కోసం ప్రతీ చిన్న విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు.

కత్తులు మొదలు తుపాకులు, కార్లు, బైక్స్ ఇలా సినిమాలో కనిపించే ప్రతి ఎలిమెంట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారని సమాచారం. 800 ఏళ్ల తర్వాత భూమ్మీద యుద్ధాలు ఎలా జరుగుతాయి? భవిష్యత్తులో ప్రజల జీవనవిధానం ఎలా ఉండబోతోంది అనే కాన్సెప్ట్‌తో ఓ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతున్నాడు డైరెక్టర్.

ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Padukone) నటిస్తోంది. బాలీవుడ్ నటి దీశా పటానీ (Disha Pathani) ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. ఇక ‘కల్కీ 2898AD’లో అమితాబ్ బచ్చన్ (Amitab Bachhan)కీలక పాత్రను పోషిస్తున్నారు.

‘అశ్వర్థామ’ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) ‘కాళి’ అలరించబోతున్నారు. ఈ మూవీలో కమల్ హాసన్ నెగెటివ్ షేట్ లో కనిపిస్తారని టాక్. ఇక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కల్కీకి సంతోష్ నారాయణన్ సంగీతం స్వరపరుస్తున్నారు.

Kalki following Mahanati sentiment : మహానటి సెంటిమెంట్ ఫాలో అవుతున్న కల్కీ

Kalki Release Date
Kalki Release Date


ఇక కల్కీ (Kalki) రిలీజ్‌ డేట్ కి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీని తమ హిట్‌ సెంటిమెంట్‌ రోజునే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

వైజయంతి బ్యానర్‌లో అప్పట్లో జగదేక వీరుడు అతిలోక సుందరి (jagadeka verrudu athiloka sundari) మూవీ మే 9న థియేటర్లలో రిలీజ్ అయ్యింది(Kalki Release Date). అప్పట్లో ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత ఇదే బ్యానెర్ లో వచ్చిన లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి (Savithri) బయోపిక్ మహానటి (Mahanati) మూవీని కూడా మే9నే విడుదల చేశారు.

ఈ మూవీ కూడా బాక్సాఫీస్ లో భారీ వసూళ్లను సాధించింది. దీంతో మే9ని వైజయంతి మూవీస్ లక్కీ డేట్ గా భావిస్తోంది. అందుకే ప్రభాస్ కల్కీ మూవీని కూడా మే9న రిలీజ్ చేయాలని భావిస్తోందట. దీంతో అదే అదృష్టం తమ ‘కల్కీ’రి కూడా పడుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది.

Leave a Comment