CJI చంద్ర చూడ్ చేతుల మీదుగా నేడు తెలంగాణా హై కోర్టు భవనానికి శంకుస్దాపన.

website 6tvnews template 2024 03 27T143818.266 CJI చంద్ర చూడ్ చేతుల మీదుగా నేడు తెలంగాణా హై కోర్టు భవనానికి శంకుస్దాపన.

Cone-laying of Telangana High Court building today by CJI Chandra Choudh : తెలంగాణా లో నూతన హై కోర్టు భవన నిర్మాణానికి అవసరమైన భూమిని ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలపడం తో ఇప్పుడు తెలంగాణా హై కోర్టు భవన సముదాయానికి శంకుస్దాపన సుప్రీం కోర్టు ప్రాధాన న్యాయమూర్తి చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది.ఇటీవల రాజేంద్ర నగర్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీ కి బుద్వేల్ లో 100 ఎకరాలను కేటాయించింది రాష్ర ప్రభుత్వం. అందుకు అవసరమైన ఉత్తర్వులు కుడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

అలాగే తెలంగాణా హై కోర్టు ను కూడా కొత్త భవనాన్ని నిర్మించి ఇప్పుడున్న హై కోర్టు ను చారిత్రాత్మక కట్టడంగా దానిని చూస్తామని అందుకు అవసరమైన నిధులు కుడా కేటాయిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే దానిని సివిల్ కోర్టు అవసరాలకు ఉపయోగిస్తామని ఆయన చెప్పారు.

2009 లో ఒకసారి తెలంగాణా హై కోర్టు లో అగ్ని ప్రమాదం సంభవించింది, ఇక అప్పట్లోనే హై కోర్టు ను పాత బస్తి నుండి వేరొక చోటకి మార్చాలని ప్రతిపాదన వచ్చింది. అయితే ఆ సమయం లో చంచల్ గూడా, ప్రింటింగ్ ప్రెస్ ప్రాతం, సోమాజీ గుడా, హై టెక్ సిటీ ప్రాంతాలలో స్థల సేకరణ కోసం అధికారులు అన్వేషించారు.

ఇప్పుడు కేటాయించిన స్థలం లో అత్యాధునిక సదుపాయాలతో అన్ని హంగులు తో కొత్త హై కోర్టు భవనాన్ని అలాగే జడ్జీలకు ఉండడానికి అనువైనన్ క్వార్టర్స్ కూడా నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవెంత్ రెడ్డి చెప్పారు. ఈరోజు శంకు స్దాపన కార్యక్రమానికి హై కోర్టు జస్టిస్ తో పాటు న్యాయమూర్తులు అలాగే పలువురు అధికారులు హాజరు అవుతారని చెప్పారు.

Leave a Comment