తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి, ఈ దఫా ఎన్నికల్లో కూడా విజయం సాధించి అధికార పగ్గాలు చెప్పాలని బి.ఆర్.ఎస్ పార్టీ భావించినా అది సాధ్యపడలేదు, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు కేసీఆర్ కలలు కన్న ఫలితం తారుమారైంది.
కనీసం పొలిటికల్ ఎనలిస్టులు అంచనా వేసినట్టుగా హంగ్ కి కూడా తెలంగాణ ప్రజలు అవకాశం ఇవ్వలేదు. అధికార పగ్గాలు ప్రగతి భావన్ నుండి గాంధీ భవన్ కి బదిలీ అయిపోయాయి, పవర్ కోసం కేసీఆర్ చేసిన యాగాలు, పూజలు, హోమాలు అన్ని కూడా బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.
కానీ గులాబీ బాస్ కి ఒక ఊరట ఏమిటంటే హైబరాబాద్ ఓటర్లు భారతీయు రాష్ట్ర సమితికి పట్టం కట్టారు. బి.ఆర్.ఎస్ అభ్యర్థులనే గెలిపించారు. దీంతో తెలంగాణ లో కారు జోరుకి కాంగ్రెస్ బ్రేకులు వేయడంలో విఫలమైంది.
కూకట్ పల్లి, పఠాన్ చేరు, ఖైరతాబాద్, ముషీరాబాద్, షేర్ లింగం పల్లి, కుత్బల్లాపూర్, మహేశ్వరం, ఎల్ బి నగర్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్ లో తన హవా చూపెట్టింది.