Congress Party Third List : మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి.

27 Congress Party Third List : మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి.

Congress Party Third List : మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు కూడా 10 వతేదీ తో ముగియనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మూడవ జాబితాను విడుదల చేసింది.

19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా ఇప్పుడు 14 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను హస్తం పార్టీ అధిష్టానం ప్రకటించింది. వాటితో పాటుగా పాత జాబితాలోని రెండు స్థానాలకు మార్పులు చేయగా వాటి అభ్యర్థుల పేర్లను కూడా తాజా జాబితాలో నే విడుదల చేసింది.

కాబట్టి మొత్తం 16 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ రిలీస్ చేసింది. పద్నాలుగు మంది జాబితాను పక్కన పెడితే గత జాబితాకు సంబంధించిన ఇద్దరు అభ్యర్థుల మార్పు ఒక్కసారి చూద్దాం.

బోథ్ నియోజకవర్గ అభ్యర్థిగా ముందు వెన్నెల అశోక్‌కు అవకాశం కల్పించగా ఆయన ప్లేస్ లో ఇప్పుడు ఆడె గజేందర్‌ వచ్చారు. వనపర్తిలో జిల్లెల్ల చిన్నా రెడ్డి కి బదులు తూడి మేఘా రెడ్డి పోటీ చేయడానికి ఛాన్స్ దక్కించుకున్నాడు.

కాంగ్రెస్ పార్టీ రెండు జాబితాలుగా ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాల్లో మొత్తం కలిపి 100 స్థానాలకు అభ్యర్థులను భర్తీ చేశారు. అయితే మూడో జాబితాలో 14 మందిని ప్రకటించగా 5 స్థానాలు మిగిలి ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి సీపీఐ సీపీఎం పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ పొత్తులో భాగంగానే కొత్తగూడెం స్థానాన్ని సీపీఐ చేతిలో పెట్టింది.

సీపీఎంతో పొత్తు విషయంపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తమకు మొదట ఆరు స్థానాలు ఇస్తామని ఇప్పుడు మూడు స్థానాలు కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం లేదంటూ తమ్మినేని భరద్వాజ్ కొన్ని రోజుల క్రితం తన అసహనాన్ని వ్యక్తం చేశారు. మిగిలిన నాలుగు స్థానాల విషయంలో ఇప్పటికి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

కొడంగల్ నియోజకవర్గంలో భారీ అనుచర గణంతో వెళ్లి నామినేషన్ వేశారు రేవంత్ రెడ్డి. అయితే ఆయన మరో నియోజకవర్గం నుండి కూడా నామినేషన్ వేస్తారని మొదటి నుండి అనుకుంటున్న మాటే.

అదే కామారెడ్డి. తెలంగాణ ముఖ్య మంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర రావు పోటీ చేస్తున్న కామ రెడ్డి బరిలో కూడా రేవంత్ రెడ్డి పోటీ చేస్తారట.

ఎలాగైనా కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించాలని రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు. ఇక అభ్యర్థుల జాబితా ఒక్కసారి చూద్దాం.

పటాన్‌చెరు – నీలం మధు ముదిరాజ్‌
నిజామాబాద్‌ (అర్బన్‌) – షబ్బీర్‌ అలీ
చెన్నూర్‌ – డా.జి వివేకానంద
కరీంనగర్‌ – పురుమళ్ల శ్రీనివాస్‌
నారాయణఖేడ్‌ – సురేష్‌ కుమార్‌ షెట్కర్‌
ఇల్లెందు – కోరం కనకయ్య
అశ్వారావుపేట – జారె ఆదినారాయణ
బోథ్‌ – గజేందర్‌ (వెన్నెల అశోక్‌ స్థానంలో)
కామారెడ్డి – రేవంత్‌ రెడ్డి
బాన్సువాడ – ఏనుగు రవీందర్‌ రెడ్డి
జుక్కల్‌ – తోట లక్ష్మీ కాంతారావు
సిరిసిల్ల – కేకే మహేందర్‌ రెడ్డి
డోర్నకల్‌ – డా. రామచంద్రు నాయక్‌
సత్తుపల్లి – మట్టా రాగమయి
వైరా – రామదాస్‌ మాలోత్‌
వనపర్తి – తూడి మేఘా రెడ్డి

Leave a Comment