Corona Positive cases in India: భారత్ లో కరోనా.. పెరిగిన పాజిటివ్ కేసులు..అప్రమత్తమైన ఆరోగ్య శాఖ.
2020 సంవత్సరాన్ని భారతీయులెవ్వరు మర్చిపోలేరు, ఆయేడాది జనవరి నెలలోనే మన దేశంలోకి కరోనా వైరస్ అడుగుపెట్టింది. అప్పటి నుండి రోజులు కాదు వరాలు కాదు నెలలు కాదు ఏకంగా రెండు సంవత్సరాల పాటు మనదేశాన్ని కుదిపేసింది.
చైనా లో మొదలైన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా అని దేశాలకు విస్తరించి విలయతాండవం చేసింది. కరోనా మహమ్మారి చేసిన కరాళ నృత్యంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.
భారతదేశంలోని వైద్య ఆరోగ్య శాఖల వారు అవలంబించిన చికిత్స విధానం, భారత సర్కారు చేపట్టిన కరోనా నివారణ చర్యల కారణంగా మనదేశంలో కరోనా నెమ్మదిగా అదుపులోకి వచ్చింది.
అంతా బాగానే ఉంది కదా అనుకుంటున్న తరుణంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కేసులు చాపకింద నీరులా మనకు తెలియకుండానే వేగంగా విస్తరిస్తున్నాయి.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వారిలో కొత్త భయాలు మొదలయ్యాయి.
కేవలం 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 166 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఈ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ కేరళ రాష్ట్రం లోనే నమోదు కావడం గమనించదగ్గ విషయం.
ఈ కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు దేశం మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య 895 కి చేరింది.ఇక కరోనా కేసులు మరోమారు పెరుగుతున్న తరుణంలో దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఒకప్పుడు కరోనా కారణంగా దేశ ప్రజలు అనేక మరణాలను తమ కళ్ళ తోనే చూశారు.
తమవారు చనిపోతే కనీసం దహన సంస్కారాలు చేసుకునే వీలు కూడా లేక మానసికంగా నలిగిపోయారు. అటువంటిది ఇప్పుడు మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయనే వార్త వినగానే వారిని గతం తాలూకు భయాలు వెంటాడుతున్నాయి.
డిసెంబర్ 10 తేదీ వరకు కూడా ఈ కరోనా వైరస్ రోజు వారి కేసులు 100 వరకు నమోదవగా, ఇప్పుడు 166 కి పెరగడం ఆందోళకు గురి చేస్తోంది వారిని. ప్రజలు అంత భయానికి గురవడానికి అర్ధం కూడా ఉంది, ఈ కరోనా లోనే వివిధ రకాల వేరియంట్లు కూడా ప్రజలపై దాడి చేశాయి.
మొదటి వేవ్ లో వచ్చిన వేరియంట్ కన్నా రెండవ వేవ్ లో వచ్చిన వేరియంట్ బలంగా దాడి చేసింది. మొదటి వేవ్ కన్నా రెండవ వేవ్ లోనే అధిక మరణాలు నమోదయ్యాయి.
పైగా ఈ కరోనా సోకి దాని నుండి బయట పడిన వారు ఇతరత్రా దీర్ఘకాలిక సమస్యలకు లోనవుతున్నట్టు కూడా కొన్ని అధ్యయనాలో తేలింది.
ప్రస్తుతం చుస్తే ఇది చలి కాలం కావడంతో కరోనా మరింత వేగంగా వ్యాపించే అవకాశం కూడా ఉంది. ఇన్‌ప్లూయెంజా వంటి వైరస్‌ల కారణంగా కూడా కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతోందని కేంద్ర సర్కారు అంటోంది.
అందుకే ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తే మంచిదని చెబుతోంది. ఇక మరణాల విషయానికి వస్తే కరోనా బారిన పడి శిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కళాశాల మరియు ఆసుపత్రిలో ఒక మహిళ మరణించింది.
మనదేశంలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదైన సమయం గనుక చుస్తే అది ఈ ఏడాది లోని జులై నెల అని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఆ నెలలో కేవలం 24 పాజిటివ్ కేసులు మాత్రమే
వెలుగుచూశాయట. 2020 జనవరి నాటి నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు చూసుకుంటే మన దేశంలో మొత్తంపాజిటివ్ కేసుల సంఖ్య 4.44 కోట్లకు చేరుకుంది.
కరోనా మరణాల సంఖ్య 5,33,306 కు చేరుకుంది. ఈ గణాంకాలను కేంద్ర ఆరోగ్య శాఖ స్వయంగా వెల్లడించింది. ఇక వాక్సిన్ తీసుకున్న వారి విషయానికి వస్తే, మన దేశంలో 220.67 కోట్ల మంది ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు వాక్సిన్లు తీసుకున్నారు.