ధనుష్, ఐశ్వర్యలకు కోర్టు ఉత్తర్వులు – నలిగిపోతున్న రజని

సూపర్ స్టార్ రజని కాంత్ కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్ కి చెన్నై ఫ్యామిలీ కోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అదేమిటంటే వారిద్దరూ తప్పని సరిగా కోర్టుకి హాజరు కావాలని సూచించింది. అసలు ఇంతకీ వారిని కోర్టు ఎందుకు పిలిపించింది అనే అనుమానం రావచ్చు. ఎందుకంటే వారు పరస్పరం అంగీకారం తో విడాకులకు అప్లై చేశారు కాబట్టి. వీరిద్దరికి 2004 లో వివాహం అయింది. యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు కూడా కలిగారు. పెళ్ళై 18 పాటు కాపురం చేసిన తరువాత వీరు విడిపోవాలని, తమ వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. వారి బాంధవ్యానికి బీటలు వారడానికి కొన్ని కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. కూతురు అల్లుడిని కలపడానికి రజని చాలానే ప్రయత్నం చేశారు కానీ అవేవీ ఫలితాన్ని ఇవ్వలేదు.

dhanush rajinikanths bond is intact despite a split with wife aishwaryaa 001 ధనుష్, ఐశ్వర్యలకు కోర్టు ఉత్తర్వులు - నలిగిపోతున్న రజని

ప్రస్తుతం వారికి విడాకులు రాకపోయినప్పటికీ వేరువేరు గానే ఉంటున్నారు. కుమారులిద్దరూ కూడా ఐశ్శ్వర్య తోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు తండ్రి వద్దకు వెళ్లి వస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు విడిపోవడాన్ని అటు రజని ఫాన్స్ కానీ ఇటు ధనుష్ ఫాన్స్ కానీ భరించలేకపోతున్నారు. ఏది ఏమైనా కోర్టు ఉత్తర్వుల ప్రకారం చూస్తే అక్టోబర్ 7వ తేదీన ఐశ్వర్య ధనుష్ లు వ్యక్తిగతంగా కోర్టు లో హాజరుకాక తప్పదు అని మాత్రం తెలుస్తోంది. ఇక కెరియర్ పరంగా చూస్తే ఐశ్వర్య దర్శకత్వంలో ఈ మధ్యనే లాల్ సలాం సినిమా తెరకెక్కింది. కానీ ఆ సినిమా సత్ఫాలితాన్ని ఇవ్వలేకపోయింది. అందులో తన తండ్రి రజని కీలక పాత్ర పోషించారు. ధనుష్ విషయానికి వస్తే ఈ మధ్యనే కెప్టెన్ మిల్లర్ విడుదల కాగా అది మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. అలాగే రాయన్, కుబేర అనే రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.

Leave a Comment