Cyber Attacks on Ayodhya Ram Mandir : 5 శతాబ్దాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో జరిగిన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఎంతో ఆసక్తిగా వీక్షించాయి. ఈ సమయం లో దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా సైబర్ నేరగాళ్లు ఒక్కసారిగా దాడులకు తెగబడ్డారని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐసిసిసిసి) చెప్పింది.
అంతే కాకుండా ఇతర విభాగాలు భారత్‌లోని సైబర్ నేరాలపై నిఘా పెట్టడం కూడా జరిగింది. నకిలీ QR కోడ్‌లు లేదా వెబ్‌సైట్‌లను సృష్టించి విరాళాలు సేకరించడం చేసింది. ఇటీవల సైబర్ దాడులు నిర్వహించినపుడు ఆ ప్రాంతాలలో నకిలీ QR కోడ్‌లు లేదా వెబ్‌సైట్‌లను సృష్టించి విరాళాలు సేకరించిన వారిని పట్టుకున్నారు.
అలాగే రామమందిర్ ప్రసాద్, మోడల్‌లు, నకిలీ టోకెన్‌లను విక్రయిస్తున్న వారిని సైబర్ నేరస్థులను నిఘా బృందం మట్టుబెట్టింది. అంతే కాదు పర్యటన కోసం భారత్‌కు వచ్చి సైబర్ మోసాలకు పాల్పడి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఓ విదేశీయుడిని కూడా అరెస్టు చేసినట్లు సైబర్ అధికారులు చెప్పారు.
భారత్‌లో మెరుగైన డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని, దానితో పాటు సైబర్ నేరాలను అరికట్టడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెపారు, అయితే ఈ మార్గంలో అనేక సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. G-20, ప్రాణ్ ప్రతిష్ట సమయంలో, భారతదేశంలో గరిష్ట సంఖ్యలో సైబర్ దాడులు జరిగాయని చెప్పారు.
అయితే వాటిని సకాలంలో నియంత్రించగల్గామని చెప్పారు. ఈ సైబర్ దాడులే కాకుండా
అత్యధికంగా ఆర్థిక నేరాల కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు.
సరియైన సమయం లో స్పందించడం వల్ల , ఆర్థిక సైబర్ నేరాలను నిరోధించడం ద్వారా ఇప్పటివరకు రూ. 1000 కోట్ల మోసం నుంచి ప్రజలను CFCFRMS రక్షించినట్లు పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం వరకు ఈ సంఖ్య రూ.200 కోట్లు మాత్రమేఉండేదని ఆయన చెప్పారు