Cyber Crime In Vijayawada : ఆన్లైన్ లో పేట్రేగిపోతున్న సైబర్ నేరగాళ్లు. విజయవాడ మహిళను మోసం చేసిన తీరు చుస్తే ఔరా అంటారు.

Add a heading 62 Cyber Crime In Vijayawada : ఆన్లైన్ లో పేట్రేగిపోతున్న సైబర్ నేరగాళ్లు. విజయవాడ మహిళను మోసం చేసిన తీరు చుస్తే ఔరా అంటారు.

Cyber Crime In Vijayawada : ఆన్లైన్ లో పేట్రేగిపోతున్న సైబర్ నేరగాళ్లు. విజయవాడ మహిళను మోసం చేసిన తీరు చుస్తే ఔరా అంటారు.

విజయవాడ నగరంలో ఓ అమాయకురాలిని సైబర్ నేరగాళ్లు నమ్మించి మోసం చేశారు. చాలా నమ్మసఖ్యంగా మాటలు చెప్పి ఆమె బ్యాంకు ఖాతా నుండి డబ్బు లూఠీ చేశారు. చివరకు జరిగింది మోసం అని గ్రహించిన ఆవిడ సైబర్ క్రైం అధికారులను, పోలీసు అధికారులను ఆశ్రయించారు. కేవలం విజయవాడ మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా అనేక మంది అమాయకులు సైబర్ మోసాలకు గురై ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ లో బ్యాంకు కార్యకలాపాలు కానీ ఇతర పనులు కానీ చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు చెబుతున్నారు. గోతికాడ నక్క మాదిగా పొంచి ఉన్న సైబర్ నేరగాళ్లు సందు దొరికితే చాలు, మన అకౌంట్ నుండి అందిన కాడికి దోచేసుకుంటున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే విజయవాడ నగరంలోని రామవరప్పాడు ప్రాంతానికి చెందిన ఒక మహిళ తన పాస్ పోర్ట్ లో అడ్రస్ ను మార్చుకోవాలని అనుకున్నారు. గతంలో ఆమె పాస్ పోర్ట్ తీసుకున్న సమయంలో ఉన్న ఇంటిలో కాకుండా ప్రస్తుతం ఆమె మరో ఇంట్లో ఉంటున్నారు. పైగా ఆమెకు గత పదేళ్ల నుండి పాస్ పోర్ట్ ఉంటోంది. అయితే అడ్రస్ కూడా మార్చుకోవాలని భావించిన ఆమె విజయవాడ లోని పాస్పోర్ట్ ఆఫీస్ కు వెళ్లి అప్లై చేశారు. అక్కడి సిబ్బంది ఆమె నుండి కావలసిన పత్రాలు అన్ని సేకరించి ఆన్లైన్ లో అప్లై చేశారు. నిర్ణీత గడువు లోగా తన ఇంటికే కొత్త అడ్రస్సుకే పాస్ పోర్ట్ పోస్టల్ ద్వారా వస్తుందని చెప్పారు. కొత్త అడ్రస్ లోనే ఉంటున్న ఆవిడకు సిబ్బంది చెప్పిన తేదీ లోపు పాస్ పోర్ట్ రాకపోవడంతో ఆమె విషయం ఏమిటో తెలుసుకోవాలనుకుంది. అక్కడే మొదలైంది అసలు కథ.

పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. మీకు పలానా తారీఖు లోగా పాస్పోర్ట్ మీ అడ్రస్ కి వస్తుందని ఉంది, కానీ ఆగడువు తీరిపోయి మూడురోజులైంది. దీంతో ఆమె ఆన్‌లైన్‌లోకి వెళ్లి పోస్టల్‌ శాఖను సంప్రదించేందుకు నంబరు కోసం వెతికారు. ఓ సైట్‌లో తన సమస్యపై ఫిర్యాదు చేశారు. దీంతో ఒక నవంబర్ నుండి, 3వ తేదీన ఆమెకు కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి అడ్రస్ సరిగా లేదని, మార్చాల్సి ఉందని అన్నాడు. రిజిస్టర్డ్‌ పోస్టు ఆలస్యానికి కూడా కారణం అదే అని నమ్మించాడు. దీని కోసం పోస్టల్‌ శాఖకు నామమాత్రంగా 5 రూపాయలు యూపీఐ ద్వారా చెల్లించాలని చెప్పాడు. అందుకోసం ఆమెకు ఒక లింక్ కూడా పంపించాడు. అయితే ఆ లింక్ కి 5 రూపాయలు పంపించేందుకు 14 సార్లు ప్రయత్నించిన ఆమె విఫలమయ్యారు. 15 వ సారి మాత్రం 5 రూపాయలు పంపగలిగారు.

ఇదంతా మోసమని ఆమె గ్రహించలేకపోయింది. యాదృశ్చికమే కాకతాళీయమో గాని ఈమె 5 రూపాయలు పేమెంట్ చేసిన తరువాతి రోజే ఆమెకు రావాల్సిన పాస్ పోర్ట్ కూడా ఆమె చేతికి వచ్చేసింది. దీంతో పోస్టల్ వారికి ఆన్లైన్ లింక్ ద్వారా 5 రూపాయలు పంపడం వల్లనే పాస్ పోర్ట్ వచ్చిందని అనుకుంది. కానీ అంతలోనే జరగాల్సిన అనర్ధం జరిగిపోయింది. ఆమె బ్యాంకు ఖాతా నుండి ఆమెకు తెలియకుండా లక్ష రూపాయలు ట్రాన్స్ ఫర్ అయిపోయాయి. ఈ విషయాన్నీ ఆమెకు బ్యాంకు వారు కాల్ చేసి చెప్పడంతో ఆమె అవాక్కయింది. తాను ఎటువంటి లావాదేవీ చేయలేదని, జరిగిందంతా మోసమని గ్రహించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, సైబర్ క్రైమ్ వారిని కూడా ఆశ్రయించి, జరిగిన ఉదంతాన్ని మొత్తం వారికి వివరించింది.

Leave a Comment