Cyber Fruad on Super Star Mahes Babu Daughter Name : ఈరోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నే మోసాలు జరుతున్నాయి, దీనికి పేద,గోప్ప,చదువు కున్నవాడ,చదువు లేని వాడ ఇలాంటివి లేకుండా అందరు ఈ సైబర్ మోసాలకు గురి అవుతున్నారు.
అంతే కాదు సెలెబ్రిటి లను టార్గెట్ చేస్తూ సైబర్ మోసగాళ్ళు రెచ్చి పోతున్నారు. ప్రజలకి కొన్ని రకాల లింకులు పంపించి వాటిని క్లిక్ చేస్తే పాలనా సెలెబ్రిటి ని కలవవచ్చ, లేదా పెద్ద గిఫ్ట్ లు సంపాదించుకోవచ్చు అని చెప్తారు.
ఇప్పుడు ఈ సైబెర్ మోసగాళ్ళు మహేష్ బాబు ఇంటికే వచ్చేశారు నేరుగా, ఎలా అంటే మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియా లో ఎంత పాపులర్ అయ్యిందో మన అందరికి తెలుసు, ఇప్పుడు దీనినే అవకాశం తీసుకుని మోసాలకి తెర తీసారు. ఏ విధం గ అంటే సితార పేరు మీద ఒక ఫోటో పెట్టి instagram ఎకౌంటు ఓపెన్ చేసి అందులో కొన్ని ట్రేడింగ్ కి అలాగే కొన్ని పెట్టుబడులు పెట్టడానికి అంటూ లింకు లు పోస్ట్ చేసారు.
Mahesh Babu Daughter Sitara Images :
ఆయితే మహేష్ బాబు కుటుంబ సబ్యులు వెంటనే దీని మీద స్పందించి ఆ లింకు లు సితార పోస్ట్ చేసినవి కావని మీడియా ద్వార తెలియ చేసారు. అంతే కాకుండా వెంటనే మాదాపూర్ పోలిస్ స్టేషన్ కి వెళ్ళి పోలీస్ లకి సమాచారం అందించారు.
దీనిని సీరియస్ గా తీసుకుని వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరారు. తక్షణం దీనిపై స్పందించిన పోలీస్లు మాదాపూర్ లో ఒక ఏరియా లో ఒకరిని అదుపులో తీసుకుని ఎంక్వయిరీ చేస్తున్నామని త్వరలోనే వివరాలు మీడియా ద్వార తెలియ చేస్తామని చెప్పారు.
భవిష్యత్ లో ఇలాంటి వి జరగకుండ సైబెర్ పోలీస్ అనుక్షణం నిఘా ఉంచుతుందని అయితే ప్రజలు కూడా తమ మొబైల్ తెలియని లింకు లు వస్తే వాటిని క్లిక్ చెయ్యడం కాని వాటిని ఓపెన్ చేసి చాటింగ్ లు చెయ్యడం కాని చెయ్యవద్దని కోరారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన ట్విట్టర్ వేదికగా మా కుటుంబ సబ్యుల పేరు మీద ఎటువంటి లింక్ లు వచ్చిన వాటికి రెస్పాండ్ కావద్దని అందరు జాగ్రత్త గా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది