Cyclone Michaung effect: ఆంధ్రప్రదేశ్ లో మిగ్​జాం ప్రభావం…

michaung

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చిన మిగ్​జాం తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. తమిళనాడు, పుదుచ్చేరి లాంటి ప్రదేశాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభావం కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో వర్షాలు భారీగా పడుతున్నాయి.

ఈ తీవ్రత ఇంకా కొన్ని రోజులు కొనసాగవచ్చని అంచనా. భారీ వర్షం, ఈదురు గాలులు కాస్తా తుఫానుగా మారడంతో ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి.

దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతాలు నైరుతి బంగాళాఖాతానికి దగ్గరలో ఉండటం వల్ల ఎక్కువ ప్రభావితం అవుతున్నాయి. ఈ తుఫాన్ తీవ్రంగా మారి దక్షిణ ఆంధ్ర తీరానికి దగ్గరగా వెళ్తుంది. నెల్లూరు – మచిలీపట్టణం ప్రాంతాలు చాలా ప్రమాదంలో ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Cyclone Michaung effect

మంగళవారం మధ్యాహ్నం బాపట్ల దగ్గరలోని ఆంధ్రప్రదేశ్ తీరానికి తుఫాన్ చేరుకుంది.
ఈ తుఫాను ప్రభావం దేశవ్యాప్తంగా రెండుకోట్ల మంది ప్రజలకి పైగా బాధించింది. ఇంతటి వినాశనం 17మంది మరణాలకు కారణమైంది.

చెన్నై, మరియు చుట్టు పక్కల ప్రాంతాలలో 16 మంది చనిపోగా, ఆంధ్రలో ఒక పాప చనిపోయింది.
ఆంద్రప్రదేశ్ లో ఈ తుఫాను ప్రభావంతో పండించిన పంటలన్నీ నాశనం అయ్యాయి.
ప్రభావితులైన 10,000 మంది ప్రజలని సురక్షితమైన ప్రాంతాలకి తరలించారు.

ఈ మిగ్​జాం తుఫాన్ మంగళవారం దాదాపు మూడు గంటలపాటు ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసాన్ని సృష్టించింది.
బలమైన గాలులు, భారీ వర్షాలతో మొదలైన విధ్వంసం కాస్తా తుఫాను గా మారింది.
మిగ్​జాం తుఫాన్ కారణంగా దాదాపు 650 విమానాలు రద్దు అయ్యాయి.

Leave a Comment