కారు దిగి సొంత గూటికి పోనున్న దానం నాగేందర్

WhatsApp Image 2024 03 15 at 4.07.43 PM కారు దిగి సొంత గూటికి పోనున్న దానం నాగేందర్


రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కోసం ఇప్పటి నుండి సమీకరణాలు మారిపోతున్నాయి. అడపా దడపా నాయకులు అటు ఇటు మారుతున్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ లో ఉంటారో చెప్పలేము. కొంత మంది అయితే తిరిగి తమ సొంత గూటికి వచ్చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే BRS పార్టీ నేతలు చాలామంది కారు దిగి వెళ్ళిపోయారు.

అందులో కొంత సిట్టింగ్ ఎంపి లు కుడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు MLA వంతు వచ్చింది. ఇప్పుఫు ఖైరతాబాద్ నియోజకవర్గం MLA దానం నాగేందర్ కుడా కారు దిగి వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల ఆయన CM రేవంత్ రెడ్డి ని కలిసారు. అయితే ఇది అంత సొంత గూటికి వెళ్ళే ప్రయత్నమే అని ప్రచారాలు జరుగుతున్నాయి. మరి చూడాలి దానం నాగేందర్ నిర్ణయం ఎలా ఉంటుందో. పార్టీ మారే ఆలోచన లో ఉన్నారా లేదా అందరి లాగే తన నియోజకవర్గం అభివృద్ధి కోసం అని అంటారో వేచి చూడాలి.

Leave a Comment