Dangerous apps don’t use : గూగుల్ తొలగించిన ప్రమాదకరమైన ఈ యాప్ లను వెంటనే మీ ఫోన్ నుంచి వీటిని డిలీట్ చేయండి..

6tv projects 19 Dangerous apps don't use : గూగుల్ తొలగించిన ప్రమాదకరమైన ఈ యాప్ లను వెంటనే మీ ఫోన్ నుంచి వీటిని డిలీట్ చేయండి..

Dangerous apps don’t use : గూగుల్ తొలగించిన ప్రమాదకరమైన ఈ యాప్ లను వెంటనే మీ ఫోన్ నుంచి వీటిని డిలీట్ చేయండి..

ఒకరి అవసరాలు, బలహీనతలు మరొకరికి లాభాలుగా, మోసం చేసే మార్గాలుగా మారుతున్నాయి. ఈ రోజులలో చాలా మంది అత్యాశలకు పోయి.. వారి ఆదాయాలకు మించి అప్పులను చేస్తుంటారు. ఇలాంటి వారే ఎక్కువగా డిజిటల్ మోసాల భారిన పడుతున్నారు. ఇలాంటి వారే ఆర్డక నేరాలకు పాల్పడే మోసగాళ్ళ మాయలో చిక్కి, కొన్ని సార్లు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. అసలు ఫేక్ యాప్ లను ఎలా గుర్తించాలి….ఆ డిజిటల యాప్ లు లేదా ఈ స్పైలోన్
ద్వారా లోన్స్ ను తీసుకుంటే ఎలాంటి చెడుపరిణామాలు చూటుచేసుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా లోన్ తీసుకునే వ్యక్తి ఆ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా చేసుకునే క్రమంలో
‘ఈ స్పైలోన్ యాప్ల ద్వారా రుణం పొందాలనుకునే వ్యక్తులు ముందుగా అప్లికేషన్ అడిగే అన్నీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అన్ని వివరాలు సరిగా ఇస్తేనే లోన్ మంజూరు అవ్వుతుంది. ఈ ఒక్క బలహీనతను ఆసరాగా చేసుకుని వందలకొద్దీ యాప్స్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సులువుగా సేకరించి, మోసాలకు పాల్పడుతున్నాయి.

తరువాత ఆ వివరాల సాయంతో బెదిరింపులకు పాల్పడుతున్నాయని స్లోవాక్ సాఫ్ట్వేర్ కంపెనీ, (ESET )సర్వే తెలిపింది. ఈ సమాచారాన్ని కాల్ లాగ్స్, క్యాలెండర్ ఈవెంట్స్, డివైజ్ ఇన్ఫో, ఇన్స్టాల్డ్ యాప్స్, వై-ఫై నెట్వర్క్ ఇన్ఫో, కు చెందిన సమాచారం, కాంటాక్ట్ లిస్ట్, లొకేషన్ డేటా, SMS సందేశాల ద్వారా యాక్సెస్ చేస్తాయి. కాగా, గూగుల్ ఇప్పటివరకు 200కుపైగా ఇలాంటి యాప్ లను ప్లేస్టోర్ నుంచి తొలగించింది.
ఈ రుణ యాప్ లు ప్రధానంగా ఆగ్నేయాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయని ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది.

అసలు స్పైలోన్ యాప్ లు అంటే ఏమిటి? వాటి ద్వారా ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం….

ఆండ్రాయిడ్ యూజర్ల కు వ్యక్తిగత రుణాలను అందించే యాప్ లను స్పైలోన్ యాప్ లు అని పేర్కొంటారు. ఇలా తయారు చేయబడిన యాప్ లన్ని చట్టబద్ధతను కలిగి ఉన్నట్టుగా, నిజమైన ఆర్థిక సేవలందించే వాటిగా తమకు తామే చిత్రీకరించుకుంటాయి. వీటిని చూసిన వినియోగదారులు వాటిని నమ్మి మోసపోతుంటారు. ఇవి మార్కెట్లో ఉన్న దానికంటే అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్స్ ను ఇస్తామని వినియోగదారులను నమ్మిస్తాయి. వీటితో పాటు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ప్రకటిస్తాయి.

ఇలా రుణం మంజూరు చేశాక తమ విశ్వరూపాన్ని బాధితులపై ప్రదర్శిస్తాయి. యూజర్స్ కు సంబంధించిన ఆర్థికపరమైన వివరాలను సేకరించి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెడతాయి.

ఈ స్పైలోన్ యాప్ లు చట్టబద్ధమైన పర్సనల్ లోన్ సర్వీసెస్ అప్లికేషన్లుగా చెప్పుకుంటూ ఫండ్స్ ను త్వరగా సులభతరంగా యాక్సెస్ చేసుకోవచ్చనే నమ్మకాన్ని యూజర్స్ కు కలిగిస్తున్నాయని ఆ సంస్థ రిపోర్ట్ లు తెలుపుతున్నాయి. అంతేకాకుండా రకరకాల ఆకర్షణీయమైన ఆఫర్స్ తో పాటు మార్కెట్ వడ్డీ రేటు కంటే తక్కువ శాతం వడ్డీలను ప్రకటిస్తూ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని సాఫ్ట్వేర్ సంస్థ ESET వెల్లడించింది. చివరకు బాధితుల బ్యాంక్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఈ లోన్ యాప్ సేకరించి వారి నుంచి పెద్ద మొత్తంలో నగదును దండుకుంటున్నాయని ఆ నివేదిక చెప్పింది.


ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిన యాప్ లు ఏమిటో తెలుసుకుందాం….
గూగుల్ తీసివేసిన ఈ స్పైలోన్ యాప్‌లలో AA క్రెడిట్, అమోర్ క్యాష్, గయ్యబాకాష్, ఈజీ క్రెడిట్, క్యాష్ వావ్, క్రెడీబస్, ఫ్లాష్ లోన్, ప్రిస్తమోస్ క్రెడిటో, డిక్రెడితో – యుమి క్యాష్, గో క్రెడిటో, ల్యాండెనియస్ వాల్లేటన్, ల్యాప్‌లోన్, ఎస్ క్యాష్, ట్రూ నైరా , మొదలైన యాప్‌లను తొలిగించినట్లు గూగుల్ పేర్కొంది
కస్టర్ల ను బురిడీ కొట్టిస్తున్న 17 మోసపూరిత ఆండ్రాయిడ్ ఆన్లైన్ రుణ యాప్లను ప్లేస్టోర్ నుంచి తొలగించింది ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్. స్లోవాక్ సాఫ్ట్వేర్ కంపెనీ ESET ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 5న ఈ హానికరమైన అప్లికేషన్లను ఆండ్రాయిడ్ డివైజుల్లో గుర్తించింది గూగుల్. స్పైలోన్స్ గా పేర్కొనే ఈ రకమైన యాప్ లను ఈ ఏడాది దాదాపు 1.2 కోట్ల మంది యూజర్స్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం విచారకరం అని ఆ సంస్థ తెలిపింది.

Leave a Comment