Danush as Music Maestro Ilayaraja , new poster release : ఇళయరాజా(Ilayaraja)..ఈ పేరు తెలియని,తలవని వారంటూ భారతదేశంలో లేరంటే అతిశయోక్తి కాదేమో. ఈయన లేకుండా భారతీయ చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడటం చాలా కష్టమనే చెప్పాలి. తన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేసిన రారాజు ఇళయరాజా.
47ఏళ్ల కెరీర్లో తెలుగు, తమిళం, మలయాళం, ఇలా అనేక భాషల్లో ఇప్పటివరకు వెయ్యికి పైగా సినిమాలు చేశారు. ఏడు వేలకు పైగా పాటలు రాశారు. ఇరవై వేలకు పైగా లైవ్ కాన్సర్ట్‌లు ఇచ్చి ఊహకందని రికార్డులను క్రియేట్ చేశారు ఈ మ్యూజిక్ మేస్ట్రో.
తన సినీ జర్నీలో సాధించిన విజయాలు, ప్రశంసలు, అవార్డులు ఎన్నో ఎన్నెన్నో. ఇలాంటి సెలబ్రిటీ జీవిత కథను తెరపై చూస్తే అంతకంటే గొప్ప అనుభూతి ఏముంటుంది. త్వరలో వెండితెరపైన ఇలయరాజా బయోపిక్ రాబోతోంది. ఈ సినిమాలో ఇళయరాజాగా ధనుష్(Dhanush) కనిపించబోతున్నాడు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. రెట్రో లుక్ లో ఉన్న పోస్టర్ ఆడియన్స్ లో మంచి పాజిటీవ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది.
ఇళయరాజాగా ధనుష్ :
ఎట్టకేలకు మ్యూజిక్ మేస్ట్రో బయోపిక్ వెండితెరమీదకు రాబోతోంది. సిల్వర్ స్క్రీన్ మీద ఇళయరాజా (Ilayaraja) క్యారెక్టర్ ను కోలీవుడ్ హీరో ధనుష్ (Dhanush)చేస్తున్నారు. ఇన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ గురించి అనేక రూమర్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మొత్తానికి ఇళయారాజా బయోపిక్ ఉంటుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ చిత్రానికి ఇళయారాజా అని టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈ టైటిల్ కు ట్యాగ్ లైన్ గా ది కింగ్ ఆఫ్ మ్యూజిక్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. రీసెంట్ గా యాక్షన్ మూవీ కెప్టెన్ మిల్లర్ (Captain Miller) తో మంచి హిట్ సాధించిన డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ (Arun Matheswaran)ఇళయరాజా మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.
చెన్నైలో షూటింగ్ స్టార్ట్ :
ఇళయరాజా (Ilayaraja)సినిమా షూటింగ్ ఇవాళ ప్రారంభమైంది. చెన్నైలోని లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా జరిగిన ఈ కార్యక్రమానికి తమిళ స్టార్ హీరోలు హాజరయ్యారు. ఈ సినిమాలో ధనుష్ హీరో కాగా కమల్ హాసన్ (Kamal Haasan),రజనీకాంత్ (Rajanikanth), శింబు (Shimbu)లు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే కార్యక్రమంలో మేకర్స్ మూవీ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. చెన్నై రోడ్ల మీద ఇళయారాజా హార్మోనియం పెట్టే పట్టుకుని ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ అందరిని ఎంతగానో ఆకర్షిస్తోంది. రెట్రో లుక్ లో ఉన్న పోస్టర్ ఇళయరాజా, ధనుష్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచేస్తోంది.
ఇళయరాజాకు ధనుష్ వీర భక్తుడు :
ఈ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ.. ” ఎట్టకేలకు నా కోరిక నెరవేరింది. ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి నాకు రెండు కోరికలు ఉన్నాయి. అందులో ఒకటి ఇవాళ్టితో పూర్తైంది. మరో కొరిక రజినీకాంత్ బయోపిక్ లోనూ నటించాలని ఉంది. ధనుష్ ఇళయరాజాకు వీర భక్తుడు. ఇళయరాజాకు కూడా ధనుష్ అంటే వల్లమాలిన ప్రేమ. ఈ కారణం వల్లేనే గురువు సినిమాలో నటించే అవకాశం కలిగింది. అంతే కాదు తన బయోపిక్ సినిమాకు కూడా ఇళయారాజానే మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం.