Rajamouli Gives Clarity About Bahubali 3: బాహుబలి 3 గురించి జక్కన్నని అడిగిన డార్లింగ్ ప్రభాస్.
PAN INDIA STAR PRABHAS నటించిన SALAAR ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.
డార్లింగ్ ప్రభాస్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నఈ సలార్ ఇంకొన్ని గంటల్లో ఘనంగా ప్రేక్షకుల ముందుకి రానుంది.
ఇప్పటికే SALAAR ప్రీ బుకింగ్ మొదలైంది. డార్లింగ్ అభిమానులు ఒక్కసారిగా ప్రీ బుకింగ్ మీద దండయాత్ర చేయడం వల్ల బుక్ మై షో సర్వర్ లు క్రాష్ అయ్యాయి.
అభిమానులకి టిక్కెట్లు బుకింగ్ చేసుకోవడంలో అంతరాయం కలగడంతో అందరూ స్క్రీన్ షాట్స్ తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీనితో BOOK MY SHOW ప్రేక్షకులకు ఎక్స్ ద్వారా క్షమాపణలు చెప్పింది.
BOOK MY SHOW కొద్దిగా బ్రేక్ ఇచ్చి అన్నీ థియేటర్ లు ఒకేసారి కాకుండా ఒక్కో థియేటర్ ఒక్కొసారిగా టిక్కెట్లు విడుదల చేసింది.
SALAAR TEAM ని ఇంటర్వ్యూ చేసిన RAJAMOULI :
SALAAR సినిమా ఎలాంటి ప్రమోషన్ లేకుండానే ప్రీబుకింగ్ లో సత్తా చూపుతోంది. కానీ SALAAR అభిమనులకి మాత్రం ఇది కాస్త నిరాశగానే ఉంది. అలాంటి సమయంలో బాహుబలి ధీరదర్శకుడు రాజమౌళి సాలార్ టీం ని ఇంటర్వ్యూ చేశాడు.
ఈ ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగింది.సినిమా విడుదల సమయం దగ్గర పడింది కదా ఎలా ఉంది అని RAJAMOULI, SALAAR దర్శకుడు PRASANTH NEEL ని ఆడగగా,
చాలా కంగారుగా ఉందని, ఇంతకు ముందు నాలుగు తీసినప్పటికి ఎప్పడూ ఇంతగా టెన్షన్ పడలేదని అన్నాడు.
SALAAR పైన ప్రేక్షకులకు ఉన్న అంచనాలకి భయంగా ఉందని అన్నాడు.ఇక అంతలోనే ఏదో మాటలో DARLING PRABHAS, RAJAMOULI ని
బాహుబలి 3 నాతో కన్ఫర్మ్ కదా అని అనేశాడు, దానికి జక్కన్న నవ్వేసి ఊరుకున్నాడు.ఇక మళ్ళీ బాహుబలి 3 ఉంటుందా అన్న ప్రశ్నలు ముందుకు వచ్చాయి.