David Warner Sensational Decision: ఆస్ట్రేలియా(Australia) క్రికెట్ సంచలనం డేవిడ్ వార్నర్ ఒక షాకింగ్ న్యూస్ ప్రకరించాడు, ఈ న్యూస్ విన్న వార్నర్ ఫాన్స్ షాక్ కి గురవుతున్నారు.
అదేమిటంటే డేవిడ్ ఇక మీదట వన్డే క్రికెట్ కి కూడా దూరం కాబోతున్నాడట. ఇప్పటికే డేవిడ్ టెస్ట్ క్రికెట్ కి దూరం అవుతున్నాను అని అనౌన్స్ చేశాడు.
ఈ ప్రకటన డేవిడ్ గతంలో చేశాడు. ఇక తాజా ప్రకటన తో డేవిడ్ టెస్టులకి వన్డేలకు రెండింటికి దూరం అవుతున్నాడు. ప్రస్తుతం తన కెరియర్ లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన వార్నర్ వన్డే క్రికెట్ కి కూడా బై బై చెప్పేశాడు.
ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా లేకపోలేదట. ఈ మధ్య కాలంలో పురుషుల వన్డే ప్రపంచ నిర్వహించారు, అందులో ఫైనల్ వరకు వెళ్లిన కంగారూలు భారత్ ను ఓడించి కప్పును సొంతం చేసుకున్నారు.
కాబట్టి వన్డే ప్రపంచ కప్(One Day World Cup) ఆస్ట్రిలియాకి సొంతమైన సమయం తన రిటైర్మెంట్ కి కరెక్ట్ సమయమని భావించాడు డేవిడ్.
అయితే రిటైర్మెంట్ విషయంలో డేవిడ్ పెద్ద మనసు చాటుకున్నాడు. సీనియర్ ప్లేయర్లు సరైన సమయంలో వైదొలగడం వల్ల టాలెంటెడ్ యంగ్ ప్లేయర్స్ జట్టులోకి వస్తారని అంటున్నాడు.
టెస్టుల్లో ఎన్ని సెంచరీలు చేశాడంటే : David Warner Centuries In Test Series
37 సంవత్సరాల వయసు లో టెస్ట్, వన్డే క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చిన వార్నర్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy 2025) కి మాత్రం ఓపెనర్ అవసరం అయితే తాను ముందుంటానని పేర్కొన్నాడు.
పాకిస్తాన్(Pakistan) తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు డేవిడ్, ఆ మ్యాచ్ అతనికి 112 వ మ్యాచ్. వార్నర్ తన కుటుంబానికి సమయాన్ని కేటాయించాలని అనుకుంటున్నాడట, అందుకే వన్డే సీరీస్ కి కూడా టాటా చెప్పేసాను అంటున్నాడు.
ఈ రెండు ఫార్మాట్ ల నుండి తప్పుకోవడం వల్ల ఫ్రాంచైజీ లీగ్(Franchise League) లో ఆడేందుకు ఎక్కువ సమయం దక్కుతుందని అన్నాడు.
అయితే వన్డే, టెస్ట్ మ్యాచ్లకి దూరమైనా ఫిట్ నెస్ కి మాత్రం దూరం కాను అంటున్నాడు. వార్నర్ టెస్టు మ్యాచుల విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 111 మ్యాచులు ఆడాడు.
వాటిలో 26 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు కొట్టాడు. పరుగుల పరంగా చుస్తే 8695 పరుగులు సాధించాడు. వన్డే సీరీస్ ల విషయానికి వస్తే, ఇప్పటివరకు 161 వన్డేలు ఆడాడి 6932 పరుగులు చేశాడు. వన్డేల్లో 22 సెంచరీలు చేశాడు.