TRAI said to Supreme court: అటువంటి నెంబర్లు 90 రోజుల తరువాతే వేరొకరికి ఇవ్వాలి – ట్రాయ్

trai 680218804 sm TRAI said to Supreme court: అటువంటి నెంబర్లు 90 రోజుల తరువాతే వేరొకరికి ఇవ్వాలి - ట్రాయ్

ప్రతి రోజు మొబైల్ ఫోన్ లో ఎదో ఒక కొత్త అప్ డేట్ వస్తూనే ఉంది, మనం ఉపయోగించుకుంటూనే ఉన్నాం. మొబైల్ లో మనం వాడే యాప్ లు అన్నీ కూడా మన ఫోన్ నెంబర్ కె కనెక్ట్ చేయబడి ఉంటాయి.

అంతే కాదు మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ మరొకరి చేతిలోకి వెళ్లిందంటే మన వ్యక్తిగత జీవితం మొత్తం వారి చేతుల్లోకి వెళ్ళినట్టే అని అర్ధం చేసుకోవచ్చు.

ఎందుకంటే మన మొబైల్ లో మన కుటుంబ సభ్యుల నుండి స్నేహితుల వరకు, అందరితో చాటింగ్ చేసిన విషయాలు, అలాగే మన వ్యాపారాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి.

మరి అవి ఇతరుల చేతిలోకి వెళితే దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మనం ఎవ్వరికి మన మొబైల్ ఫోన్ ఇవ్వము.

కానీ మనం గనుక ఏదైనా ప్రత్యేక సందర్భంలో మన నంబర్ ఎక్కువ కాలం పాటు వాడకుండా వదిలేస్తే అది డీయాక్టీవ్ అయిపోతుంది, అలా డీయాక్టీవ్ అయిన నంబర్ ను రీసైకిలింగ్ ప్రాసెస్ లో భాగంగా వేరేవారికి అప్పగిస్తారు. అలా ఇవ్వడం వల్ల మన పర్సనల్ డేటా కూడా వారికీ వెళుతుంది అనే అనుమానం మనకు రావచ్చు.

Advertising sector gets the mobile edge 2 800x420 1 TRAI said to Supreme court: అటువంటి నెంబర్లు 90 రోజుల తరువాతే వేరొకరికి ఇవ్వాలి - ట్రాయ్

ఈ విచారణలో ట్రాయ్ కొన్ని విషయాలు తెలిపింది. పాత వినియోదారుడి డేటాపై ఎటువంటి భంగం కలుగకూడదు అనే ఉద్దేశంతోనే 90 రోజుల వ్యవధి పెట్టుకున్నట్టు చెప్పింది.

గోప్యత అనే విషయంలో సబ్స్క్రైబర్లు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కేవలం ట్రాయ్ మాత్రమే కాక వాట్సాప్ కూడా తన వాదనను వినిపించింది.

ఒక వ్యక్తి తన అకౌంట్ ను రెగ్యులర్ గా వినియోగిస్తున్నాడా, లేదా అన్న విషయాన్నీ తాము పరిశీలిస్తూనే ఉంటామని చెప్పింది. 45 రోజులు పాటు యాక్టీవ్ గా లేకుండా ఉండిపోయిన నంబర్ ను మరో డివైస్ లో వేసినప్పటికీ, పాత డేటా అందుబాటులో ఉండదని, మొత్తం డిలీట్ అవుతుందని తెలిపింది.

అదికూడా ఆటోమాటిక్ గానే డిలీట్ అయిపోతుందట. దీని వల్ల అక్రమార్కులేవరు కూడా వ్యక్తుల డేటాను దుర్వియోగం చేసేందుకు వీలుండదు అని చెబుతోంది.

Leave a Comment