రోజు రోజుకీ అప్పుల భాధలు పెరుగుతున్నాయ – ఈ మొక్కలను వెంటనే తీసేయండి !

WhatsApp Image 2024 03 21 at 11.13.16 AM రోజు రోజుకీ అప్పుల భాధలు పెరుగుతున్నాయ - ఈ మొక్కలను వెంటనే తీసేయండి !

మన హిందువులకు జ్యోతిష్య శాస్త్రం లో , వాస్తు శాస్త్రంలో ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. మనం వాటి ప్రకారం నడుచుకోవాలి. శాస్త్రానికి విరుద్ధం గా వెళ్ళకూడదు. మనలో కొంత మంది ఏం కాదులే అనుకుంటారు. కాని కొంత మంది శాస్త్రం తెలియక చేసిన పనులు వాస్తు శాస్త్రం ప్రకారం దోషాలుగా ఏర్పడతాయి. పూవ్వులతోను , పూల మొక్కల వల్ల కూడా వాస్తు దోషాలు వస్తాయని మీకు తెలుసా !


పూవ్వుల వల్ల పలు రకాల దోషాలు వస్తాయని చెబుతున్నారు మన వాస్తు శాస్త్ర నిపుణులు. అలాంటి పూవ్వులను కాని, మొక్కలను కాని ఇళ్ల లోను, షాపులు లోను మరియు ఆఫీస్ లో కాని ఆవరణ లో కాని ఎక్కడా ఉండకూడదు, అలాగే వాడకూడదు అని చెప్తున్నారు పండితులు. మహిళలు పువ్వుల కోసం రక రకాల మొక్కలను ఇంటి పెరట్లో పెంచుతారు. ఆ మొక్కలకు పూసిన పువ్వులు తెంపుకుని తలలో అలంకరించుకుంటారు. లేదంటే పువ్వులు అమ్మే వారి వద్దకు వెళ్లి కొనుక్కుంటారు. పూజకు అర్హత లేని ఇటువంటి రక రకాల పువ్వులను తలలో పెట్టుక్కోవడం కాని అందం గా ఉన్నాయని పూజకి వాడినట్లయితే ఎన్నో ఆర్ధక ఇబ్బందులు ఏర్పడి చివరికి అప్పుల పాలు అవుతారు.

మనం నిత్యం ఉపయిగించే పువ్వుల వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. మనం వాడే పువ్వులు పూజకి అర్హత ఉండాలి అవి ఎప్పుడు మంచి పరిమళాల్ని వెదజల్లుతూ ఉండాలి అలాగే మనసుకు మంచి ఆహ్లాదం కలిగించేలా ఉండాలి. అంతే కాని సువాసనలు లేనివి పూజకు అర్హత లేనివి ఎత్తి పరిస్థితులలో వాటిని వాడకండి. మనలో చాలా మంది ఇంటి బయట అందంగా ఉండాలని రక రకాల పూల మొక్కలు పెంచుతారు. అవి మంచిని కలిగించకపోగా మీకు ప్రతికూల శక్తి ని అంటే నెగిటివ్ ఎనర్జీ తీసుకొస్తాయి. అలాగే మన ఇంటి ఆవరణ లో నాటిన మొక్కలను వారు ఆసక్తిగా పెంచరు.

అది క్రమంగా వాడుతూ మొక్క నీరసంగా తయారవుతుంది. ఇలా చెయ్యడం వలన చీడ పీడల వంటివి ఆ మొక్కలపై ఏర్పడతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం అలాంటి మొక్కలను వీలైనంత తొందరగా తీసేయాలి, అలాంటి మొక్కలు ఇళ్లలో ఉండకూడదు. అలా వదిలేయడం వల్ల ఆ మొక్కల ద్వారా ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంతే కాదు వాడిపోయిన మొక్కలు మొదట ఆ ఇంటి యజమానిని శపిస్తాయని శాస్త్రాలలో, పురాణాలలో కుడా చెప్పడం జరిగింది. దీని వలన ఇంట్లో ఉండే డబ్బంతా పోతుంది. అప్పులు, కష్టాలు మరియు గొడవలు బాగా పెరిగి అశాంతి ఏర్పడతుంది.

మనం బయట కొనే పూలు కూడా తాజాగా ఉన్నాయా లేదా అనేది తప్పనిసరిగా చూసుకోండి. వాడిపోయిన పువ్వుల వల్ల వాస్తు దోషాలు వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. మన ఇంటి లో కాని ఆఫీస్ లో కాని వాడిన పోయిన పూలు, పాడైన మొక్కలు ఉంటె ధనలక్ష్మి ఉండదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బయట తక్కువ రేటుకి అమ్మినా కూడా అలాంటి పూవ్వులను అస్సలు కొనుక్కోవద్దని సూచిస్తున్నారు పెద్దలు. రేటు ఎక్కువైనప్పటికీ మంచి పూలు, తాజా పూలను మాత్రమే పూజలకు ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఆ ఇళ్లలో సుఖ సంతోషాలు మెండు గా ఉంటాయని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

తెచ్చిన తాజా పూలు తర్వాత రోజుకు పూర్తిగా వడిలిపోతాయి. అలాంటి వాటిని వెంటనే తీసివేయాలి, ఒకవేళ ఉంచితే కూడా ఇంట్లో కాని ఆఫీస్ కాని ధనం నిలబడదు అని వాస్తు పండితులు చెబుతున్నారు. మనలో చాలా మంది భద్దకించి వాటిని 2, 3 రోజులు అలాగే వదిలేస్తారు. వాటి అలాగే వదిలేస్తే మాత్రం ప్రతికూల ఏర్పడి ఆ ఇంట్లో ఉన్న వారు అనారోగ్యానికి గురవుతారని పెద్దలు చెప్తున్నారు.అంతే కాదు వారిని అప్పులపాలు చేస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పువ్వుల విషయం లోను మొక్కల విషయం లోని జాగ్రత్తలు తీసుకుంటే ఇంటి యజమాని తో పాటు కుటుంబ సబ్యులు అందరూ ఆనందో త్సాహాల ఉంటారు.

Leave a Comment