December 6, Wednesday Horoscope: డిసెంబర్ 6, బుధవారం రాశిఫలాలు..ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

December 6, Wednesday Horoscope.

December 6, Wednesday Horoscope: డిసెంబర్ 6, బుధవారం రాశిఫలాలు..ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మేషరాశి:

మేషరాశి వారికి ఈరోజు చాలా బాగుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి.. చాలకాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి.

వృషభ రాశి:

వీరికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం.

మిధున రాశి:

మిధున రాశివారికి వృత్తి ఉద్యోగాలలో స్థానచలనం ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం దొరకదు. ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. దైవదర్శనం చేసుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం ఓం నమ:శివాయ మంత్రం జపించండి.

కర్కాటక రాశి:

వీరికి ఆర్థికవ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలం.

సింహ రాశి:

వీరికి ఈరోజు ఆర్థికంగా మంచి ఫలితాలను పొందలేరు. మానసిక ఒత్తిడి ఉంది. ఉద్యోగంలో పై అధికారుల ఆగ్రహానికి గురికావాలసి వస్తుంది. మానసిక చికాకులు సూచిస్తున్నాయి. దైవ చింతన అవసరం. వ్యాపారస్తులకు, విద్యార్థులకు అనుకూలంగా లేదు.

కన్య రాశి:

Add a heading 2023 12 06T160752.238 December 6, Wednesday Horoscope: డిసెంబర్ 6, బుధవారం రాశిఫలాలు..ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అప్పులు తీర్చగలుగుతారు. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది.

తుల రాశి:

తులరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. రావాల్సిన డబ్బు ఆలస్యంగానైనా చేతికి అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదువృత్తి వ్యాపారాలలో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

వృశ్చిక రాశి:

వీరికి ఈరోజు అనుకూలంగా ఉంది. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

మకర రాశి:

ఈరోజు ఈరాశి వారు ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణ యత్నాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.

కుంభ రాశి:

ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలుతో కాని పూర్తికావు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దైవచింతన అవసరం.

మీన రాశి:

వ్యాపారపరంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు తరువాత కాలానికి ఉపయోగపడతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి.

Leave a Comment