December 7, Thursday Horoscopes : డిసెంబర్ 7 , గురువారం రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశి వారికి స్వల్ప విభేదాలు తప్పవు.

Thursday Horoscopes

మేషరాశి:

భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

వృషభ రాశి:

వీరికి ఈరోజు ఆకస్మిక ధనలాభం ఉంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. సంతాన విషయంలో శుభవార్తలు అందుతాయి.

మిధున రాశి:

మిధున రాశి వారికి దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి .ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

కర్కాటక రాశి:

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

సింహ రాశి:

నూతన వాహనం కొనుక్కోవాలంటే ఇది సరైన సమయం కాదు.. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి. సంఘంలో పేరు ప్రతిష్టతలు కలుగుతాయి.

కన్య రాశి:

వృధా ఖర్చులు చేయకండి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం.

తుల రాశి:

తులరాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు తొలిగిపోతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.

వృశ్చిక రాశి:

కుటుంబసభ్యులతో వివాదాలు కలిగే అవకాశాలున్నాయి. మానసిక ప్రశాంతత కరువైవుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. అయినప్పటికీ వాటన్నింటినీ పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి ఈరోజు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పనులు చకచకా సాగుతాయి. మీ నిర్ణయాలు అందరికి నచ్చే విధంగా ఉంటాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు.

మకర రాశి:

ఈరోజు ఈరాశి వారికి ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్త్ర వస్తులాభాలు పొందుతారు. సంతోషంగా ఉంటారు.

కుంభ రాశి:

కుంభరాశివారికి దూర ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. కుటుంబంలో కొందరి మాటలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. పాత ఋణలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు.

మీన రాశి:

వీరు కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరంగా సమస్యలు తప్పవు.. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం దైవ చింతన కలుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. దైవదర్శనాలు చేసుకుంటే మంచిది. విద్యార్థులకు అనుకూలంగా లేదు.

Leave a Comment