తల్లికాబోతున్న దీపికా పదుకొనే: Deepika Padukone became mother

website 6tvnews template 2024 02 29T144125.769 తల్లికాబోతున్న దీపికా పదుకొనే: Deepika Padukone became mother

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనే (Deepika Padukone), రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రెగ్నెంట్. దేనితో దీపికా తల్లికాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు రణ్‌వీర్ సింగ్ . ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అభిమానులు, సినీ ప్రేమికులు, సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా దీపికా ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రణ్‌వీర్ సింగ్ ఈ పోస్ట్ తో ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు.

చిన్నారి దుస్తులు, వస్తువులతో డిజైన్ చేసిన ఓ పోస్ట్‌ ద్వారా దీపికా తన ప్రెగ్నెన్సీ గురించి తెలిపింది . తనకు పుట్టబోయే బిడ్డ సెప్టెంబర్ లో జన్మిస్తుందనే విషయాన్ని కూడా తెలిపారు.

2024 సెప్టెంబర్ లో ఫస్ట్ చైల్డ్‌కి స్వాగతం :

బాలీవుడ్ తారలు దీపికా పదుకొనే(Deepika Padukone ), రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆరేళ్ల డేటింగ్ అనంతరం
2018 నవంబర్ లో వీరి వివాహం జరిగింది. ఇటలీలో(Italy )ని లేక్ కోమో(Lake como )లో అతి కొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు కుటుంబ సభ్యుల నడుమ వీరి పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది. సంజయ్ లీలా భన్సాలీ( Sanjay Leela Bhansali )డైరెక్ట్ చేసిన రామ్-లీలా (Ram Leela )సెట్స్‌లో వీరి కి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత బాజీరావ్ మస్తానీ (Bajirao Mastani ), పద్మావత్ (Padmaavat) చిత్రాల్లోనూ ఈ ఇద్దరు కలిసి నటించారు. గత ఏడాది నవంబర్‌లో, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే తమ 5వ వెడ్డింగ్ యానివర్సరీని బెల్జియం (Beljium ) లో జరుపుకున్నారు.వీరి వివాహం జరిగి ఆరేళ్లవుతున్నా ఎలాంటి శుభవార్త లేకపోవడంతో ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు. ఈ నేపథ్యంలో రణవీర్ సింగ్ తమ మొదటి బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. ఈ స్టార్ కపుల్ తమ బిడ్డ సెప్టెంబర్ 2024లో వస్తున్నట్లు పోస్ట్ ద్వారా తెలిపారు.

WhatsApp Image 2024 02 29 at 12.55.27 PM తల్లికాబోతున్న దీపికా పదుకొనే: Deepika Padukone became mother

మా ఇద్దరికీ పిల్లలంటే ఇష్టం :

2018లో దీపికా , రణ్‌వీర్ పెళ్లి జరిగినప్పటి నుండి పిల్లలు ఎప్పుడు అనే అనివార్యమైన ప్రశ్నను ఈ జంట ఎదుర్కొంటోంది. ఈ ప్రశ్నకు ప్రస్తుతం మా కెరీర్ పైనే దృష్టి పెట్టామని చాలాసార్లు ఈ జంట సమాధానం ఇచ్చింది. తల్లిదండ్రులు ఎప్పుడు కావాలి అననేదానిపే మాకు క్లియర్ విజయం ఉందని కూడా చెప్పకువచ్చింది. అంతేకాదు పిల్లలు పట్ల వారికున్న ప్రేమను కూడా చాలా సందర్భాల్లో తెలియజేశారు.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకొణె తనకు తల్లి కావాలని ఉందని, రణ్‌వీర్ సింగ్‌తో కలిసి సొంత కుటుంబాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్లు చెప్పింది . వోగ్ సింగపూర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లలపై రణవీర్‌కి ఉన్న ప్రేమ గురించి తెలిపింది. ” నా తల్లిదండ్రులు, అత్తమామలు, కుటుంబ సభ్యులు, స్నేహితులను నేను కలుసుకున్నప్పుడు.. నేను ఎంతమాత్రం మారలేదని వారు అంటుంటారు.

ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు, డబ్బుకు దూరమైపోవడం చాలా తేలిక. కానీ ఇంట్లో నన్ను ఎవరూ సెలబ్రిటీలా చూసుకోరు. నేను మొదట ఓ కూతురిని, ఓ సోదరిని. అది మారడం నాకు ఇష్టం లేదు. నా కుటుంబం నన్ను స్థిరంగా ఉంచుతుంది. రణవీర్, నేను కూడా మా పిల్లలకు అదే విలువలను నేర్పించాలని ఆశిస్తున్నాము”. అని తెలిపింది.

Leave a Comment