Deepika Padukone: కాలినడకన తిరుమలకు దీపికా పదుకొనె..స్వామివారికి ప్రత్యేక పూజలు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె తిరుమలలో ప్రత్యేక్షమైంది. తిరుమల నడక మార్గంలో తమ అభిమాన నటి దీపిక ఒక్కసారిగా కనిపించడంతో భక్తులు షాక్ అయ్యారు .
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం దీపికా పదుకొనె తిరుమలకు వచ్చింది. ఈ క్రమంలో అలిపిరి నడక మార్గంలో గోవిందుని నామస్మరణ చేస్తూ దీపికా తిరుమల చేరుకుంది.
గురువారం రాత్రి అలిపిరి నడకమార్గం నుంచి దీపికా నడుచుకుంటూ వచ్చి స్వామి సన్నిధికి చేరుకున్నారు. సుమారు మూడున్నర గంటలపాటు దీపికా పదుకొనె నడకమార్గంలో నడిచింది.
నలుపు రంగు దుస్తులు ధరించి ఒక బ్యాగ్ ను పట్టుకుని దీపిక కనిపించింది. తన పర్సనల్ టీమ్ దీపిక వెంటే తిరుమల చేరుకున్నారు. గోవిందుని నామాన్ని స్మరించుకుంటూ దీపికా పదుకొనె ఎంతో భక్తితో అలిపిరి మార్గంలో కనిపించింది.
తిరుమల నడక మార్గంలో దీపిక కనిపించడంతో ఆశ్చర్యపోయిన భక్తులు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించారు.
రాత్రే తిరుమలకు చేరుకున్న దీపిక రాధేయం అతిధి గృహంలో బస చేసింది. ఇవాళ ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో, వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనుంది.
దీపిక పదుకొనెకు ఈ ఏడాది బాగా కలిసిచ్చిందనే చెప్పాలి. ఆమె నటించిన పఠాన్, జవాన్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి.
#WATCH | Andhra Pradesh | Actor Deepika Padukone arrived at Tirumala this evening, to offer prayers to Lord Venkateswara. Her sister and professional golfer Anisha Padukone was also with her. pic.twitter.com/o1x6g9dLG5
— ANI (@ANI) December 14, 2023
భారీ వసూళ్లను కలెక్ట్ చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఈ రెండు సినిమాలు 1,000 కోట్ల కలెక్షన్ లకు పైగా సాధించాయి. ప్రస్తుతం దీపిక మూడు సినిమాల్లో నటిస్తోంది .
అందులో ఒకటి ఫైటర్. ఈ మూవీ లో డ్యాన్సింగ్ కింగ్ హృతిక్ రోషన్ తో జోడీ కట్టింది దీపిక . ఈ మధ్యనే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇక టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న కల్కి 2898 ఏడీ సెట్స్‌పై ఉంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో దీపిక తొలిసారి తెలుగు లో యాక్ట్ చేయబోతోంది.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీ అశ్వనీదత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని.. ఇతర కీలక పాత్రల్లో కనిపించునున్నారు. వీటితో పాటే దీపిక మరో సినిమా సింగం ఎగైన్ లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ జరుపుకొంటోంది.