Delhi Air Pollution new updates : నియంత్రణకు ఆనంద్ మహీంద్రా అద్భుత సలహా.ఢిల్లీలో బడులకు సెలవులు ఎందుకంటే.

3 1 Delhi Air Pollution new updates : నియంత్రణకు ఆనంద్ మహీంద్రా అద్భుత సలహా.ఢిల్లీలో బడులకు సెలవులు ఎందుకంటే.

Delhi Air Pollution new updates : నియంత్రణకు ఆనంద్ మహీంద్రా అద్భుత సలహా.ఢిల్లీలో బడులకు సెలవులు ఎందుకంటే.

దేశ రాజధాని ఢిల్లీ లో వాయు కాలుష్యం కారణంగా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సీతాలకాలంలో ఈ వాయు కాలుష్యం మరీ ఎక్కువగా ఉంటుంది. వాయు కాలుష్యాన్ని అదుపులోకి

తీసుకొచ్చేందుకు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కారు,అలాగే కేంద్రంలోని బీబీజేపీ సర్కారులు ఎంతగానో కృషి చేస్తున్నాయి. అయితే ఈ వాయు కాలుష్యాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రముఖ బిజినెస్‌మెన్ ఆనంద్ మహీంద్రా ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు.

ఢిల్లోలోని వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సలహా పునరుత్పత్తి వ్యవసాయం. ఈ పునరుత్పత్తి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల కాలుష్యం తగ్గు ముఖం పడుతుంది అని పేర్కొన్నాడు.

ఆనంద్ మహీంద్రా సలహా సంగతి పక్కన పెడితే, అసలు వ్యవసాయం వల్ల వాయు కాలుష్యం ఏర్పడటమేమిటి అని చాల మందికి సందేహం రావచ్చు..

అదేమిటంటే, ఢిల్లీ చుట్టుప్రక్కల ఉన్న హర్యాణా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోని రైతులు తమ పంట చేతికి అంది వచ్చాక, ఆ పంట వ్యర్ధాలను తగలబెట్టేస్తున్నారు. తగలబెట్టిన పంట వ్యర్ధాల వల్ల పొగ గాలిలోకి కలిసి తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతోంది.

అయితే దీనిని నియంత్రించేందుకు ఆనంద్ మహీంద్రా పునరుత్పత్తి వ్యవసాయాన్ని ప్రతిపాదించారు. రైతులంతా పునరుత్పత్తి వ్యవసాయాన్ని ప్రారంభించాలని సూచించారు. వారంతా పునరుత్పత్తి వ్యవసాయాన్ని చేపట్టడం వల్ల ఢీలో లోని వాయు కాలుష్యం అదుపులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

అయితే ఇది కేవలం ఢిల్లో లోని వాయు కాలుష్యం తగ్గించడానికి మాత్రమే కాదట, పునరుత్పత్తి వ్యవసాయాన్ని అవలంబించడం ద్వారా భూమి మరింత సారవంతమవుతుందని పేర్కొన్నారు ఆనంద్ మహీంద్రా.

పంటలను కోసిన తర్వాత వాటి వ్యర్థాలను కాల్చడానికి బదులు ప్రత్యామ్నాయ పద్దతులను పాటించడం ద్వారా కాలుష్యాన్ని చాలా వరకు అదుపు చేయొచ్చంటున్నారు. ఆ ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి ఒక వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

మరో వైపు కేజ్రీవాల్ సర్కారు దీపావళి తరువాత నుండి సరి బేసి సంఖ్యా విధానాన్ని మరో మారు అమల్లోకి తీసుకురానుంది. ఇక సాధారణంగా ఢిల్లోలో వింటర్ వెకేషన్ సెలవులు ఇస్తారు.

ఢిల్లీలో డిసెంబరు చివరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు శీతాకాలం సెలవులు ఇస్తారు. కానీ ఈసారి కాలుష్యం కారణంగా ముందుగానే సెలవులు ప్రకటించారు. దీని వల్ల ఈనెల 22 వ తేదీ వరకు అక్కడ బదులు మూతపడనున్నాయి.

Leave a Comment