డిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి – బొంబాయి హై కోర్టు

WhatsApp Image 2024 03 05 at 12.51.21 PM 1 డిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి - బొంబాయి హై కోర్టు

డిల్లి యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా చేసున్న ప్రొఫెసర్ సాయిబాబా ని మావోయిస్ట్ లతో సంబందాలు ఉన్నాయి అని అరెస్ట్ చేసారు. అరెస్ట్ అయిన రోజున నుండి జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే ఈరోజు బొంబాయి హై కోర్టు అతనిని నిర్దోషి గా ప్రకటించింది.

ఇదే కేసులో సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుని సైతం పక్కన బెట్టింది హై కోర్టు. ఆయన మీద ఆరోపణలు ప్రాసిక్యూషన్ వారు రుజువు చెయ్యలేకపోవడం తో ఆయన మీద ఉన్న అభియోగాలు కొట్టేస్తున్నట్లు హై కోర్టు ప్రకటించింది. ఈయన తో పాటు మరో 5 గురుని కూడా నిర్దోషులు గ న్యాయ స్దానం తీర్పు ఇచ్చింది.

అయితే ఈ తీర్పు పై స్టే విధించాలని మహా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ను అభ్యర్ధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు తో సంబందాలు ఉన్నాయని 2014 లో అంగవైకల్యం తో భాధపడుతున్న సాయిబాబా తో పాటు మరో 5 గురుని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసారు. ఇంతకుముందు 2023 లో విచారణ చేపట్టిన న్యాయస్దానం వీరిని నిర్దోషులుగా పేర్కొంటూ హై కోర్టు తీర్పు ఇచింది.

అయితే వారు అప్పీల్ చెయ్యడం తో మళ్ళి మొదటినుండి విచారణ చెయ్యాలని ఉన్నత న్యాయస్దానం ఆదేశించడం తో మళ్ళి విచారణ చేపట్టి సాయిబాబా తో మిగిలిన వారిని కుడా నిర్దోషులు గా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. అరెస్ట్ అవ్వడం తో ప్రొఫెసర్ సాయిబాబా ను 2014 లో డిల్లి యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. తిరిగి 2021 సంవత్సరం లో ఏకంగా పూర్తి గా ఆయనని విధులనుండి తొలగించింది.

Leave a Comment