ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి అరుదైన గుర్తింపు

వరల్డ్ వైడ్ గా ఉండే అన్ని విమానాశ్రయాల్లోకి అత్యంత రద్దీగా ఉండే మొదటి 10 విమానాశ్రయాలు ఏవి అనేదానిపై ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ప్రతి ఏడాది ఒక నివేదికను వెలువరిస్తూ ఉంటుంది. తాజాగా వెల్లడించిన ఈ నివేదికలో ఢిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా చోటు దక్కించుకుంది. దీంతో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి ఒక అరుదైన గుర్తింపు దక్కినట్టయింది. ఇక ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గేట్ వే అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడి నుండే విదేశాలకు వెళ్లే అన్ని విమానాలు ఫ్లై అవుతూ ఉంటాయి.

GettyImages 159915684 56fa4cb25f9b582986725dd8 ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి అరుదైన గుర్తింపు

ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోని మూడవ టర్మినల్ చాలా పెద్దదని చెప్పాలి. ఇది ప్రపంచంలోని ఐదవ పెద్ద టర్మినల్ గా గుర్తింపబడింది. ఇక తోలి స్థానం లో నిలిచిన ఎయిర్ పోర్ట్ ఏది అనేది చూద్దాం. ఫస్ట్ ప్లేస్ లో అట్లాంటా కి చెందిన హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్ నిలిచింది. ఈ ఎయిర్ పోర్ట్ నుండి 2023 లో 10.46 కోట్ల మంది ఫ్లైట్ జర్నీ చేశారు. 2022 తో కంపేర్ చేస్తే 12% ఇంక్రీస్ అయిందట. ఇక ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి అయితే 2023 సంవత్సరానికి గాను 7.22 కోట్ల మంది ప్రయాణం చేశారు.

Leave a Comment