Ambedkar photo demand on currency: కరెన్సీ పై అంబెడ్కర్ ఫోటో డిమాండ్.. సీఎం రేవంత్ రెడ్డికి కి వినతి పత్రం.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పాటు పడిన మహనీయుడు డాక్టర్ బీఆర్. అంబేద్కర్, అంటరాని తనంతో చిన్న వయసులోనే సమాజంలో చీత్కారాలను ఎదుర్కొని, పట్టుదలతో చదివి పట్టభద్రుడై,
మన దేశ రాజ్యాంగాన్ని Indian Constituency రచించిన మహోన్నత వ్యక్తి. కటిక పేదరికంలో మగ్గిపోతున్న వారికి రిజర్వేషన్లతో ఉద్యోగావకాశాలు కల్పించి దాద్య్రం నుండి బయటకు తెచ్చిన మహా మనిషి.
అందుకే ఇప్పటికి అంబెడ్కర్ ని ఈ దేశం మర్చిపోలేదు. ఎటువంటి స్వార్ధం, రాజకీయ లబ్ది కోరకుండానే అతి సామాన్యులు కూడా అయన విగ్రహాలకు Ambedkar Statues చేతులెత్తి మొక్కుతారు.
ఇటువంటి సమయంలోనే ఒక విన్నూతమైన డిమాండ్ వెలుగులోకి వచ్చింది. అదే కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ఫొటోను ముద్రించాలానే ఆలోచన.
దీనికోసం కరెన్సీపై అంబేద్కర్ ఫొటో పేరిట ఒక సాధన సమితి కూడా ఏర్పాటైంది. ఈ సాధన సమితి ఇప్పుడు తెలంగాణ లో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద తమ డిమాండ్ ను ఉంచింది.
Establishing a Set Was founded:
కరెన్సీపై అంబేద్కర్ ఫొటో Ambedkar Photo ముద్రించేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి అధ్యక్షులు డా. జేరిపోతుల పరశురామ్ విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంలో శాసనసభ్యులు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఆ నివేదికను పంపించాలని వారు కోరారు. ఇది విషయమై వారు డిసెంబర్ 20వ తేదీన ఢిల్లీ Delhi లో సీఏపీఎస్ఎస్ నేత ఆళ్ల రామకృష్ణ తో కలిసి సీఎం రేవంత్ కు CM Revanth Reddy వినతిపత్రం అందజేశారు.
దీని గురించి పరశురామ్ మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒకప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి లోక్ సభలో కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో అనే అంశాన్ని లేవనెత్తారని గుర్తుచేశారు.
అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా ఉన్నారు కాబట్టి వినతి పత్రాన్ని మరోమారు అందజేశామన్నారు, ఈ అంశం పై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ Telangana Assembly తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరినట్లు చెప్పారు.