Devara Glimpse records: ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన దేవర గ్లింప్స్.

Glimpses of Devara who created an all-time record.

Devara Glimpse records: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala siva),యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్

(Jr Ntr) ల కాంబినేషన్‎లో రూపొందుతున్న మూవీ దేవర.

సమ్మర్ కానుకగా ఈ భారీ బడ్జెట్ మూవీ విడుదల కాబోతోంది. ఎన్టీఆర్‎కు జోడీగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కనిపించనుంది.

తెలుగు తెరకు తొలిసారిగా ఈ మూవీతోనే పరిచయం కాబోతోంది జాన్వీ. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఏప్రిల్ 5 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ మూవీ రిలీజ్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‎గా దేవర మొదటి భాగం (Devara Part 1) అఫీషియల్ గ్లిమ్స్ సోషల్ మీడియా వేదికగా విడుదలైంది.

ఈ గ్లింప్స్‎కు ఎన్టీఆర్ అభిమానులు, సినీ ప్రేక్షకుల నంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం దేవర గ్లింప్స్ యూట్యూబ్‏లో టాప్‏లో ట్రెండింగ్‏లో ఉంది.

టాలీవుడ్‎లోనే వ్యూస్ పరంగా ఆల్ టైం రికార్డ్ నమోదు చేసింది దేవర గ్లింప్స్. ఈ గ్లింప్స్ విడుదలైన 24 గంటల్లో 26 మిలియన్లకు పైగా హైయెస్ట్ వ్యూస్ సాధించి టాప్ స్థానంలో నిలబడి దేవర సత్తా ఏంటో చూపించింది.

తెలుగులోనే కాదు ఇతర ఐదు భాషల్లోనూ 24 గంటల్లో ఈ గ్లింప్స్ 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి దుమ్ముదులుపుతోంది.

Devara glimpses breaking records : దేవర గ్లింప్స్ బ్రేకింగ్ రికార్డ్స్

దేవర గ్లింప్స్ (Devara Glimps) విడుదలైనప్పటి నుంచి ఎన్నీ రికార్డులను బద్దలు కొట్టాలో అన్నింటిని ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తోంది.

1000018719 Devara Glimpse records: ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన దేవర గ్లింప్స్.

గ్లింప్స్ విడుదలైన 24 గంటల్లో తెలుగులో 26 మిలియన్లకుపైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. దీంతో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు గ్లింప్స్‌‎గా దేవర ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది.

ఇక లైకుల విషయంలో కూడా దేవర గ్లింప్స్‌ దూసుకెళ్తోంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానుల్లో సంక్రాంతి సందడి ముందుగానే షురూ అయ్యింది.

‘దేవర’ (Devara) గ్లింప్స్ కొన్ని కోట్ల మంది అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సినీ ప్రియుల్లో దేవరపై అంచనాలను భారీగా పెంచేసింది.

ఈ గ్లింప్స్ తో దర్శకుడిగా ఓ కొత్త కొరటాల శివ (Koratala Siva)ను చూడబోతున్నామని ఫీల్ కలుగుతోంది. ఎన్టీఆర్ లుక్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దద్దరిల్లిపోయాయి.

ఈ ఒక్క గ్లింప్స్ తో దేవర తీరేంటి? అతని కత్తికి ఉన్న పదునెంతో చూపించాడు కొరటాల శివ. ప్రస్తుతం దేవర గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

దీంతో ఒక్కసారిగా ఇంటర్నెట్ దేవర గ్లింప్స్ (Devara Glimps)తో ఎరుపెక్కిపోయింది. దేవర క్రేజ్ అంటే ఇట్లుంటదని అభిమానులు చెబుతున్నారు.

Devara Break Guntur Kaaram Record : గుంటూరు కారం రికార్డ్ బ్రేక్ చేసిన దేవర.

ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న ప్యాన్ ఇండియన మూవీ ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్నసినిమా కావడంతో అందరి చూపు దేవరపైనే ఉంది.

ఆర్ఆర్ఆర్ క్రేజును, రేంజ్‌ను.. పరిగణలోకి తీసుకొని దర్శకుడు కొరటాల శివ ఎన్టీర్ ను సరికొత్తగా చూపించేందుకు చాలా కష్టపడ్డాడని అర్థమవుతోంది. దేవర గ్లింప్స్ లో బ్లడ్ బాత్ ఎలా ఉంటుందో శాంపిల్ చూపించాడు కొరటాల శివ (Koratala siva).

Guntur Kaaram Pushpa 2 Devara Glimpse records: ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన దేవర గ్లింప్స్.

ముఖ్యంగా సముద్రం ఎక్కడైనా ఎరుపెక్కుతుందా అని ఎన్టీఆర్ (Jr NTR) చెప్పిన డైలాగ్‌ అందరిలో గూస్ బంప్స్‌ తెప్పించాయి. ఈ దెబ్బతో ఏప్రిల్ 5న బాక్సాఫీస్ ఎరుపెక్కడం ఖాయంగా తెలుస్తోంది.

ఇక సినిమా రిలీజ్ కు ముందే రికార్డులను నెలకొల్పుతోంది. దేవర గ్లింప్స్ టాప్ వ్యూస్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మధ్యనే విడుదలైన గుంటూరు కారం గ్లింప్స్ రికార్డులను సైతం పక్కకు నెట్టేసింది దేవర.

దేవర గ్లింప్స్ 26 మిలియన్ల వ్యూస్ తో మొదటి స్థానంలో నిలవగా గుంటూరు కారం ( Guntur Kaaram) 20.98 మిలియన్ల వ్యూస్ తో రెండో స్థానంలో నిలిచింది.

మూడో స్థానంలో 20.25 వ్యూస్ తో పుష్ప2 (Pushpa2) నిలవగా 15.92 మిలియన్ల వ్యూస్ తో లైగర్ (Liger), 15.57 మిలియన్ల వ్యూస్ తో ఉత్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagath Singh)ఆ తర్వాత వరుసలో ఉన్నాయి. ఇక దేవర గ్లింప్స్ విడుదలైన ఐదు భాషల్లో కలిపి 50 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

Leave a Comment