NTR Devara glimpse: దేవర గ్లింప్స్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.

Devara Glimpse release date is coming.

NTR Devara glimpse: దేవర’ (Devara) మూవీ అప్‌డేట్‌ గురించి ,ఎన్టీఆర్‌ (NTR) ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా నుంచి టీజర్‌, గ్లింప్‌ ఏదైనా వదులుతారేమోనన్న
వారి ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి.

న్యూ ఇయర్ వేళ ఎన్టీఆర్ తన అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ దేవరలోని తన లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఖుషి చేశారు.

అంతేకాదు దేవర గ్లింప్స్ గురించి కూడా ఓ సాలిడ్ అప్డేట్ ని అందించారు. దేవర గ్లింప్స్ జనవరి 8న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

What is the story of Devara movie? : దేవర సినిమా కథ ఏంటి?

దేవర(Devara) సినిమాను నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం డైరెక్టర్ కొరాటల శివ (Koratala Siva )భారీ స్కెచ్ వేశారని తెలుస్తోంది.

ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ (RRR ) మూవీ తర్వాత ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న సినిమా కావటంతో హీరోని ఎలివేట్ చేయడానికి బాగా వర్కౌట్ చేస్తున్నారట.

ఈ మూవీలో దారుణమైన హత్యాకాండను చూపిస్తున్నట్లు న్యూస్ వస్తోంది. 1985లో ఉమ్మడి ఏపీ లోని బాపట్ల సమీపంలోని పొలిటికల్ తుఫానును రేకెత్తించిన భయంకరమైన కారంచేడు (karamchedu ) సంఘటన నేపథ్యంలో తీస్తున్న ఓ పెద్ద యాక్షన్ చిత్రంగా తెలుస్తోంది.

కొంత మంది దళితుల(Daliths )ను అతి దారుణంగా అగ్రవర్ణాలకు చెందిన వారు ఊచకోత కోశారు. ఎంతోమందిని నిరాశ్రయులను చేశారు. ఈ అంశాన్నే సినిమాలో చూపిస్తున్నట్లు సమాచారం. సరికొత్త ప్రపంచం, బలమైన క్యారెక్టర్స్ , ఎమోషన్స్ ఉన్నాయి.

How many parts of Devara movie are there? : దేవర సినిమా ఎన్ని భాగాలంటే..

దేవర(devara )భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రాబోతోంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ (NTR) కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ (Jahnavi Kapoor ) నటిస్తోంది.

ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మొదట దేవర ను ఒకటే పార్ట్ గా రిలీజ్ చేద్దామని భావించినప్పటికీ కొన్ని కారణాలతో కారణంగా దీన్ని రెండు భాగాలుగా తీస్తున్నట్లు కొరటాల శివ (Koratala siva)ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే సినిమా అని ముందే హైప్ తీసుకొచ్చారు. అందుకే దేవర ను ఒక భాగంలో కంప్లీట్ గా చూపించడం కష్టమని తెలిపారు.

Who is villain in Devara? : దేవరలో విలన్ ఎవరు?

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా దేవర మూవీ తెరకెక్కుతుంది. దీంతో అందరి దృష్టి ఈ సినిమా పైనే పడింది. అందులోనూ ఎన్టీఆర్ (NTR ) మూవీ కావడంతో ఫాన్స్ ఆయనకు తగ్గ విలన్ ఉండాలని బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) ని విలన్ రోల్ కి ఎంపిక చేశారు. రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో సైఫ్ భైరవ పాత్ర పొషిస్తున్నాడు . ఉంగరాల జుట్టుతో, బ్లాక్ డ్రెస్ లో సైఫ్ లుక్ మైండ్ బ్లాక్ చేసింది. ఎన్టీఆర్ కి స్ట్రాంగ్ ప్రత్యర్థిగా భైరవ క్యారెక్టర్ ను తీర్చిదిద్దారట. దేవర (Devara)మూవీలో విలన్ పాత్ర చాలా భయానకంగా ఉంటుందని డైరెక్టర్ చెప్తున్నారు. అంతే కాదు దేవర-భైరవ మధ్య ఫైటింగ్ సీన్స్ భయంకరంగా ఉంటాయని సమాచారం.

heading4: devara movie release date : దేవర రిలీజ్ డేట్

జనవరి 8 న దేవర టీజర్ విడుదలవుతుందని మేకర్స్ తాజాగా భారీ పోస్టర్‌ను విడుదల చేశారు. అభిమానులు ఈ గ్లింప్స్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా దేవర రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.
దేవర మొదటి భాగం ఈ ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలో
విడుదల కానుంది.

ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా ,బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ (prakash raj) , శ్రీకాంత్ (Srikanth ), మురళీ శర్మ, కలైయరసన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ( Anirudh Ravichandar ) ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నాడు.

Leave a Comment