Devara records: జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానుల్లో సంక్రాంతి సందడి కాస్త ముందుగానే షురూ అయ్యింది. తాజాగా విడుదలైన ‘దేవర’ (Devara) గ్లింప్స్ కొన్ని కోట్ల మంది అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
సినీ ప్రియుల్లో దేవరపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ గ్లింప్స్ తో దర్శకుడిగా ఓ కొత్త కొరటాల శివ (Koratala Siva) ను చూడబోతున్నామని ఫీల్ కలుగుతోంది.
ఎన్టీఆర్ లుక్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దద్దరిల్లిపోయాయి. ఈ ఒక్క గ్లింప్స్ తో దేవర తీరేంటి? అతని కత్తికి ఉన్న పదునెంతో చూపించాడు కొరటాల శివ.
ప్రస్తుతం దేవర గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. దీంతో ఒక్కసారిగా ఇంటర్నెట్ దేవర గ్లింప్స్ (Devara Glimps)తో ఎరుపెక్కిపోయింది.
దేవర క్రేజ్ అంటే ఇట్లుంటదని అభిమానులు చెబుతున్నారు. ఈ గ్లింప్స్ తో రికార్డులు బద్దలవ్వాల్సిందేనంటూ నెటిజన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
Devara Blockbuster Hit : బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్
కొరటాల శివ (Koratala siva)దర్శకత్వంలో నటవిశ్వరూపం యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర.
ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న ప్యాన్ ఇండియన మూవీ ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్నసినిమా కావడంతో అందరి చూపు దేవరపైనే ఉంది.
The power of the sea and the fury of the tiger are turning unstoppable 🌊https://t.co/LSIPQlW3Dy#DevaraGlimpse clocks whopping 4️⃣0️⃣M+ views and counting… 💥#Devara@tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @anirudhofficial@NANDAMURIKALYAN @RathnaveluDop… pic.twitter.com/1B2KSYN965
— T-Series (@TSeries) January 9, 2024
ఈ మూవీలో తొలిసారిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ సీనియర్ స్టార్స్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ క్రేజును, రేంజ్‌ను.. పరిగణలోకి తీసుకొని దర్శకుడు కొరటాల శివ ఎన్టీర్ ను సరికొత్తగా చూపించేందుకు చాలా కష్టపడ్డాడని అర్థమవుతోంది.
తాజాగా వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ఎన్టీఆర్ ఇమేజ్ ను మరింత పెంచేసింది. దేవర ఊచకోత మామూలుగా లేదు..విజువల్ వండర్‌లా నిలిచే ఈ గ్లింప్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్లు అప్పగించేలా చేసింది. దీంతో ఈబొమ్మ బ్లాక్ బస్టర్ హిట్టనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
NTR dialogue gives goose bumps : గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఎన్టీఆర్ డైలాగ్
80 సెకెండ్ల గ్లింప్స్ లో బ్లడ్ బాత్ ఎలా ఉంటుందో శాంపిల్ చూపించాడు కొరటాల శి (Koratala siva)వ. ముఖ్యంగా సముద్రం ఎక్కడైనా ఎరుపెక్కుతుందా అని యంగ్ టైగర్ చెప్పిన డైలాగ్ అందర్లో గూస్ బంప్స్ తెప్పించాయి.
దేవర (Devara) ఊచకోతతో సముద్రం రక్తంతో ఎరుపెక్కింది. ఆ అలలు ఎన్టీఆర్ (Jr NTR)పై పడడం అనేది విజువల్ వండర్‌లా నిలుస్తుంది.
ఈ దెబ్బతో ఏప్రిల్ 5న బాక్సాఫీస్ ఎరుపెక్కడం ఖాయంగా తెలుస్తోంది. దేవర గ్లింప్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ట్విట్టర్లో దేవర ట్యాగ్స్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.
Devara glimpses breaking records : దేవర గ్లింప్స్ బ్రేకింగ్ రికార్డ్స్
దేవర గ్లింప్స్(Devara Glimps) విడుదలైనప్పటి నుంచి ఎన్నీ రికార్డులను బద్దలు కొట్టాలో అన్నింటిని ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తోంది . ఇప్పటి వరకు ఈ గ్లింప్స్ 40 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది.
కేవలం తెలుగులోనే దేవర గ్లింప్స్ 22 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. దీంతో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు గ్లింప్స్ గా దేవర డికార్డ్ సెట్ చేసింది.
ఇంకా 24 గంటలు సమయం పూర్తి కాలేదు. ఇవాళ సాయంత్రం వరకు సమయం ఉంది ఈ నేపథ్యంలో దేవర ఫైనల్ గా ఎన్ని రికార్డులు నెలకొల్పుతుందో వేచి చూడాల్సిందే.
ఇక లైకుల విషయంలో కూడా దేవర గ్లింప్స్ 650K లైక్స్ ని సొంతం చేసుకుంది. ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాలంటే మాత్రం దేవర గ్లింప్స్ మరో 80K లైక్స్ ని ఇవాళ ఈవినింగ్ కల్లా రాబట్టాల్సి ఉంది.
అప్పుడే దేవర గ్లింప్స్ రికార్డ్ క్రియేట్ చేసినట్లు అవుతుంది. ప్రస్తుతం ఈ రికార్డను టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు పైన ఉంది . మరి ఎన్టీఆర్ ఈ రికార్డును బ్రేక్ చేస్తాడో లేదో వేచిచూడాల్సిందే.