NTR Devara Movie: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దేవర లీక్డ్ ఫోటో.
YOUNG TIGER NTR నటిస్తున్న సినిమా DEVARA. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వం లో రాబోతుంది. ఈ సినిమాతో JANHVI KAPOOR టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఈ దేవర సినిమాలో NTR లుక్స్ చూసిన అభిమానులు ఫిదా అయ్యారు.
ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. DEVARA సినిమా రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు.
మొదటి భాగం ఈ 2024 ఏప్రిల్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
DEVARA 2024 :
Release date | 5 April 2024 (India) |
Director | Koratala Shiva |
Cast | NTR Janhvi Kapoor Saif Ali Khan |
Producer | Kosaraju Harikrishna |
Music director | Anirudh Ravichander |
Cinematography | R. Rathnavelu |
Language | Telugu |
దేవర మళ్ళీ ట్రెండింగ్ లోకి :
JUNIOR NTR, JAHNVI KAPOOR, SAIF ALI KHAN ప్రధాన పాత్రలలో నటిస్తున్న DEVARA సినిమా గురించి NTR అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
RRR లాంటి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాక NTR నుండి వస్తున్న సినిమా DEVARA. అందుకే అతని అభిమానుల్లో అంచనాలు కాస్త భారీగానే ఉన్నాయి.
ఈ సినిమాకి సంబందించి ఎటువంటి చిన్న వార్త అయిన క్షణాల్లో వ్యాపిస్తోంది. ఇటీవల DEVARA షూటింగ్ సమయంలోని ఒక ఫోటో సోషల్ మీడియా లో లీక్ అయింది. NTR గుబురు గడ్డం, నలుపు దుస్తుల్లో ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.