తెలుగు హీరో కి డెవిల్ సినిమా మరో KGF కాబోతోందా ? సెట్ చేస్తే బాలివుడ్ సెలెబ్రిటి : Devil movie going to be another KGF for Telugu hero.

website 6tvnews template 12 1 తెలుగు హీరో కి డెవిల్ సినిమా మరో KGF కాబోతోందా ? సెట్ చేస్తే బాలివుడ్ సెలెబ్రిటి : Devil movie going to be another KGF for Telugu hero.

Devil movie going to be another KGF for Telugu hero : స్యాండిల్ వుడ్ చాలెంజింగ్ స్టార్ అయిన దర్శన్ ఇటీవల బాలీవుడ్ భాయ్ సంజయ్ దత్ ని కలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కుడా వైరల్ అవుతున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ చిత్రంలో దర్శన్ నటిస్తున్నాడు . అదే సంస్థకు చెందిన మరో చిత్రంలో సంజు భాయ్ కుడా నటిస్తున్నారు.

చాలెంజింగ్ స్టార్ దర్శన్, సంజూ భాయ్ కలిసి నటించబోతున్నారని తెలిసి డీ బాస్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. దర్శన్ హీరో గా నటించిన కాటేరా సినిమా ఇటీవల ిభారీ విజయం సాధించడంతో ఆ సినిమా యూనిట్ సభ్యులు, చాలెంజింగ్ స్టార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

హీరో దర్శన్ కూడా కాటేరా విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. దాదాపు రూ. 200 కోట్లకు పైగా కాటేరా సినిమా వసూళ్లు రాబట్టింది. హీరో దర్శన్ ఇప్పుడు డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. జోగి ఫేమ్ ప్రేమ్ డెవిల్ సినిమాకు దర్శకత్వం చేపట్టబోతున్నాడు. కేవీఎన్ ప్రోడక్షన్స్ సినిమా డెవిల్ సినిమాను నిర్మించడానికి భారీ సన్నాహాలు చేస్తోంది.

WhatsApp Image 2024 02 09 at 10.56.27 AM తెలుగు హీరో కి డెవిల్ సినిమా మరో KGF కాబోతోందా ? సెట్ చేస్తే బాలివుడ్ సెలెబ్రిటి : Devil movie going to be another KGF for Telugu hero.

ఇటీవల కేవీఎన్ చిత్ర బృందంతో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించాడు. కరియ సినిమాలో కలిసి పనిచేసి విజయం సాధించిన ప్రేమ్ మళ్లీ దర్శన్‌తోనే జోడీ కడుతున్నాడు. హీరో దర్శన్ సినీ జీవితాన్ని కరియా సినిమా మార్చేసిందనే చెప్పాలి. మెగస్టార్ చిరంజీవికి ఖైదీ సినిమాలో ఎలా టర్నింగ్ పాయింట్ వచ్చిందో హీరో దర్శన్ కు కరియా సినిమా అంతే టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. డెవిల్ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ప్రేమ్ డైరెక్ట్ చేసిన కేడీ చిత్రంలో సంజయ్ దత్ నటించారు.

ఇప్పుడు సంజయ్ దత్ కేడీ సినిమా షూటింగ్ కోసం బెంగళూరులోనే ఉన్నాడు. ఈ కేడీ చిత్రాన్ని కూడా కేవీఎన్ సంస్థ నిర్మిస్తోంది. అయితే సంజయ్ దత్, దర్శన్ స్నేహపూర్వకంగా బాగా దగ్గరఅయ్యారని తెలిసింది. దర్శన్, సంజయ్ దత్‌లను కలిసి చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

కేజీఎఫ్-2 సినిమా ద్వారా సంజూ భాయ్ మళ్ళి స్యాండిల్ వుడ్‌లోకి అడుగుపెట్టారు. దర్శన్ తదుపరి చిత్రంలో సంజూ భాయ్ నటిస్తున్నాడా? అనే సందేహం సిని వర్గాలని కలవార పెడుతోందనే చెప్పాలి. దర్శన్, సంజయ్ దత్ కలిసి నటిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో అని డీబాస్ అభిమానులు అప్పుడే తెగ ఊహించుకుంటున్నారు.

కొన్ని విభేదాల కారణంగా మళ్లీ దర్శన్‌తో సినిమా చేయనని గతంలో దర్శకుడు ప్రేమ్ బహిరంగంగానే చెప్పాడు. అయితే ప్రేమ్ ప్రకటనతో ఆయన భార్య, ప్రముఖ నటి రక్షిత షాక్ అయ్యారని, తరువాత ఆమె రాజీ ప్రయత్నాలు చేశారని సిని వర్గాలు చెప్పాయి . ఇద్దరిని కలిసి సినిమా చేసేలాఒప్పించింది అని స్యాండిల్ వుడ్ వర్గాలు అంటున్నాయి. చివరకి హీరో దర్శన్, దర్శకుడు ప్రేమ్ కాంబినేషన్ లో డెవిల్ సినిమా సెట్ మీదకు వచ్చింది. ప్రస్తుతం దర్శన్ డెవిల్ సినిమాతో చాల బిజీ అయిపోయాడు.

Leave a Comment